పోతన భాగవత పరిమళం

"ఎచ్చటఁ బుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికిన్" [7.46]

అక్షర క్రమము 8   Prev  /  Next

(తరగతి క్రమము 63)
అది సకలావతారంబులకు మొదలి గనియైన
శ్రీమన్నారాయణ దేవుని విరాజమానంబయిన దివ్యరూపంబు;
దానిం బరమ యోగీంద్రులు దర్శింతురు;
అప్పరమేశ్వరు నాభికమలంబు వలన
సృష్టికర్తలలోన శ్రేష్ఠుండైన బ్రహ్మ యుదయించె;
నతని యవయవ స్థానంబులయందు లోకవిస్తారంబులు గల్పింపబడియె;
ఛందస్సు (Meter): వచనము
స్కంధము (Chapter): 1
సంఖ్య (Number): 63
ఈ వచనము ఈ క్రింది సంస్కృత శ్లోకములకు పోతనగారు చేసిన తెలుగు అనువాదము.

यस्याम्भसि शयनस्य योगनिद्रां वितन्तवः ।
नाभिहृदाम्बुजारासीद्ब्र्ह्मा विश्वसृजां पतिः ॥
एतन्नानावताराणां निधनं बीजमव्ययं ।
यस्यांशांशेन सृज्यन्ते देवतिर्यङ्नरादयः॥

యస్యాంభసి శయనస్య యోగనిద్రాం వితంతవః ।
నాభిహృదాంబుజాదాసీద్బ్రహ్మా విశ్వసృజాం పతిః ॥
ఏతన్నానావతారాణాం నిధానం బీజమవ్యయం ।
యస్యాంశాంశేన సృజయంతే దేవతిర్యఙ్‌నరాదయః ॥
వ్యాఖ్య
[సూతుడు శౌనకాది మునులతో భాగవత కథారంభములో ఈ విధముగా చెప్పెను.]
సాధన
అది సకలావతారంబులకు మొదలి గనియైన
శ్రీమన్నారాయణ దేవుని విరాజమానంబయిన దివ్యరూపంబు;
దానిం బరమ యోగీంద్రులు దర్శింతురు;
అప్పరమేశ్వరు నాభికమలంబు వలన
సృష్టికర్తలలోన శ్రేష్ఠుండైన బ్రహ్మ యుదయించె;
నతని యవయవ స్థానంబులయందు లోకవిస్తారంబులు గల్పింపబడియె;
adi sakalAvatAraMbulaku modali ganiyaina
SrImannArAyaNa dEvuni virAjamAnaMbayina divyarUpaMbu;
dAniM barama yOgIMdrulu darSiMturu;
apparamESvaru nAbhikamalaMbu valana
sRshTikartalalOna SrEshThuMDaina brahma yudayiMce;
natani yavayava sthAnaMbulayaMdu lOkavistAraMbulu galpiMpabaDiye;
కార్యపత్రం (Worksheet)
కార్యపత్రం, పద్యసహితం (Worksheet with padyam)