పోతన భాగవత పరిమళం

"ఎచ్చటఁ బుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికిన్" [7.46]

తరగతి క్రమము 75   Prev  /  Next

ఈశ్వరునియందు సమర్పితంబైన కర్మంబు
తాపత్రయంబు మానుప నౌషధంబగు; నే ద్రవ్యంబువలన
నే రోగంబు జనియించె నాద్రవ్యం బా రోగంబు మానుపనేరదు;
ద్రవ్యాంతరంబులచేత నైన చికిత్స మానుపనోపు;
ఛందస్సు (Meter): వచనము
స్కంధము (Chapter): 1
సంఖ్య (Number): 110
ఈ వచనము ఈ క్రింది సంస్కృత శ్లోకములకు పోతనగారు చేసిన తెలుగు అనువాదము:

एतत्सूचितं ब्रह्मंस्तापत्रयचिकित्सितम्।
यदीश्वरे भगवति कर्म ब्रह्मणि भावितम्॥
आमयो यश्च भूतानां जायते येन सुव्रत।
तदेव ह्यामयं द्रव्यं न पुनाति चिकित्सितम्॥

ఏతత్సంసూచితం బ్రహ్మంస్తాపత్రయచికిత్సితమ్।
యదీశ్వరే భగవతి కర్మ బ్రహ్మణి భావితమ్॥
ఆమయో యశ్చ భూతానాం జాయతే యేన సువ్రత।
తదేవ హ్యామయం ద్రవ్యం న పునాతి చికిత్సితమ్॥
వ్యాఖ్య
[నారదుడు వ్యాసునకు ఈ విధముగా బోధించెను:]

ఈశ్వరునియందు సమర్పితంబైన కర్మంబు = భగవంతునికి అర్పించుకొనిన కర్మ;
తాపత్రయంబు మానుప నౌషధంబగు = తాపత్రయము అనబడు ఆధిభౌతికము, ఆధిదైవికము, ఆధ్యాత్మికము అను మూడు బాధలనుంచి విముక్తి చేయగల ఔషధమగును;
ఏ ద్రవ్యంబువలన నే రోగంబు జనియించె = ఏ పదార్థము ఒక రోగమునకు కారణమైనదో;
ఆద్రవ్యం బారోగంబు మానుపనేరదు = ఆ పదార్థము ఆ రోగమును నయము చేయజాలదు;
[కాని] ద్రవ్యాంతరంబులచేత నైన చికిత్స = అదే పథార్థమును రూపాంతరము తో లేదా సరయిన సమయాంతరముతో ఒక ఔషధముగా వాడి చికిత్స చేసిన యెడల;
మానుపనోపు = ఆ రోగము నయమగును;

మనసుకు కలుగు వ్యధలు లేదా బాధలు మూడురకములని చెప్పబడినది; అవి తాపత్రయములు: (1) ఆధిభౌతికము - భౌతికముల ద్వారా కలిగినవి (natural causes), (2) ఆధిదైవికము - దైవిముగా కలిగినవి (accidental or supernatural), (3) ఆధ్యాత్మికము - ఆత్మ ద్వారా కలిగినవి (matters related to the soul). మానవుడు చేయు కర్మను దైవమునకు అర్పించినయెడల ఆ కార్యము ఈ మూడు వ్యధలనుండి విముక్తి యగుటకు ఔషధము గా మారును.
సాధన
ఈశ్వరునియందు సమర్పితంబైన కర్మంబు
తాపత్రయంబు మానుప నౌషధంబగు; నే ద్రవ్యంబువలన
నే రోగంబు జనియించె
నాద్రవ్యం బా రోగంబు మానుపనేరదు;
ద్రవ్యాంతరంబులచేత నైన చికిత్స మానుపనోపు;
ISvaruniyaMdu samarpitaMbaina karmaMbu
tApatrayaMbu mAnupa naushadhaMbagu; nE dravyaMbuvalana
nE rOgaMbu janiyiMce
nAdravyaM bArOgaMbu mAnupanEradu;
dravyAmtaraMbulacEta naina cikitsa mAnupanOpu;
కార్యపత్రం (Worksheet)
కార్యపత్రం, పద్యసహితం (Worksheet with padyam)