పోతన భాగవత పరిమళం

"ఎచ్చటఁ బుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికిన్" [7.46]

గ్రంథ క్రమము 105   Prev  /  Next

(తరగతి క్రమము 111)
కీటకముఁ దెచ్చి భ్రమరము
పాటవమున బంభ్రమింప భ్రాంతంబై త
త్కీటకము భ్రమరరూపముఁ
బాటించి వహించుఁగాదె భయయోగమునన్
ఛందస్సు (Meter): కందము
స్కంధము (Chapter): 7
సంఖ్య (Number): 16
శతృత్వముతో భగవంతుని చేరినట్లుగా భక్తిభావముతో చేరలేమని తన భావమును తెలిపి, తరువాత భగవంతుని యందు భయము కలిగి యుండిననూ భగవంతుని చేరవచ్చని తెలియజేయుచూ నారదుడు ఈ పద్యములోని విధముగా ఉదహరించెను. ఈ పద్యము ఈ క్రింది సంస్కృత శ్లోకమునకు పోతనగారు చేసిన తెలుగు అనువాదము.

कीटः पेशस्कृता रुद्धः कुड्यायां तमनुस्मरन् ।
संरम्भभययोगेन विनते तत्स्वरूपताम् ॥

కీటః పేశస్కృతా రుద్ధః కుడ్యాయాం తమనుస్మరన్।
సంరమ్భభయయోగేన విన్దతే తత్స్వరూపతామ్ ॥
వ్యాఖ్య
కీటకముఁ దెచ్చి = [ఒక] పురుగును తీసికొని వచ్చి;
భ్రమరము = తుమ్మెద (carpenter bee);
పాటవమున బంభ్రమింప = నైపుణ్యముతో [ఆ పురుగు చుట్టూ] తిరుగుచుండగా;
భ్రాంతంబై తత్కీటకము = కలవరపడిపోయి ఆ పురుగు;
భ్రమరరూపముఁ బాటించి వహించుఁగాదె = ఆ పురుగు తుమ్మెద ఆకారమును పొందును కదా!;
భయయోగమునన్ = భయయోగము వలన;
సాధన
కీటకముఁ దెచ్చి భ్రమరము
పాటవమున బంభ్రమింప భ్రాంతంబై
త్కీటకము
భ్రమరరూపముఁ
బాటించి వహించుఁగాదె భయయోగమునన్
kITakamu@M decci bhramaramu
pATavamuna baMbhramiMpa bhrAMtaMbai ta
tkITakamu
bhramararUpamu@M
bATiMci vahiMcu@MgAde bhayayOgamunan
కార్యపత్రం (Worksheet)
కార్యపత్రం, పద్యసహితం (Worksheet with padyam)