పోతన భాగవత పరిమళం

"ఎచ్చటఁ బుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికిన్" [7.46]

తరగతి క్రమము 42   Prev  /  Next

క్షోణితలంబునన్ నుదురు సోఁకఁగ మ్రొక్కి నుతింతు సైకత
శ్రోణికిఁ జంచరీక చయ సుందరవేణికి రక్షితామర
శ్రేణికిఁ దోయజాతభవ చిత్త వశీకరణైక వాణికిన్
వాణికి నక్షదామ శుక వారిజ పుస్తక రమ్య పాణికిన్.
ఛందస్సు (Meter): ఉత్పలమాల
స్కంధము (Chapter): 1
సంఖ్య (Number): 6
పోతనగారు తన ఇష్ట దేవతా ప్రార్థన చేయుచు వ్రాసిన పద్యములలో ఇది యొకటి. ఇది సరస్వతీ దేవిని ప్రార్థిస్తూ వ్రాసిన పద్యము.
వ్యాఖ్య
క్షోణి = నేల;
తలంబునన్ = పైభాగముమీద;
నుదురు సోఁకఁగ మ్రొక్కి = (నా యొక్క) నుదురు అంటుకొనేటట్లుగా మ్రొక్కి;
నుతింతు = పొగడెదను (అనగా సాష్టాంగ నమస్కారము చేసి నేను నీకు మ్రొక్కెదను అని అర్థము);
సైకత (=ఇసుక) శ్రోణికిఁ (=పిరుదులు గలిగిన వానికి) = అందమైన స్త్రీ కి (దేవతకు అని అర్థము);
చంచరీక = తుమ్మెదల;
చయ = సమూహముల (వలె);
సుందర = అందమయిన;
వేణికి = జడ(లు) గల (దేవతకు);
రక్షితామర శ్రేణికిఁ = అమరులను రక్షించే దేవతకు;
తోయజాత భవ అనగా తామరలో నివసించు వానికి - బ్రహ్మకు అని ఒక అర్థము - - లేదా వైరాగ్య బుద్ధితో: తోయజాత = (నీటిలో పుట్టియు నీటితో తడుపబడని) తామర వలె;
భవ = సంసార బంధములలో పుట్టియును ఆ బంధములను (తొలగించి);
చిత్త = (నా) మనస్సును;
వశీకరణైక = వశము చేసికొను;
వాణికిన్ = పలుకులను పలికే దేవికి;
వాణికి = సరస్వతీ దేవికి;
అక్షదామ = రుద్రాక్షలను;
శుక = చిలుకను;
వారిజ = తామర పువ్వును;
పుస్తక = పుస్తకమును;
రమ్య = సంపెంగ పువ్వును;
పాణికిన్ = చేతులలో పట్టుకొనిన (దేవతక"జ్ఞానమును ప్రసాదించునది" అని చెప్పుకొనవచ్చును. ఈ పద్యములో పోతనగారు "ణి" అనే అక్షరమును (స్త్రీ లింగమును) ఎక్కువసార్లు ఉపయోగించారు: క్షోణి, శ్రోణి, వేణి, శ్రేణి, వాణి, పాణి.

"తోయజాతభవ చిత్త వశీకరణైక వాణికిన్" అనే ప్రయోగము ఇంకొక విశేషము. ఊహకు అందని భావనలను, పదములలో నప్పనటువంటి ఆలోచనలను సంస్కృత భాషలో ఎంత సులువుగా సమకూర్చవచ్చో, అంతే సులువుగా తెలుగుభాషలో కూడా చెప్పవచ్చు అనుటకు ఈ ప్రయోగము ఒక ఉదాహరణ. బ్రహ్మ దేవుని మనసు వశము చేసికొనినవానికి అని ఒక అర్థం. కానీ ఈ పదముల యొక్క ప్రతిపదార్థము ఈ విధముగా కూడా చెప్పుకొనవచ్చును: తామర (lotus) - భవ (life) - చిత్త (heart) - వశీకరణైక (controlling) - వాణికిన్ (speaker). కానీ ఈ పదములు ఒకచోట చేర్చినపుడు ఎంతో నిగూడార్థము వచ్చును. ఇటువంటి పదసౌందర్యము, భాషావేగము English భాషయందు లేదని చెప్పనవసరము లేదు.
సాధన
క్షోణితలంబునన్ నుదురు సోఁకఁగ మ్రొక్కి నుతింతు సైకత
శ్రోణికిఁ
జంచరీక చయ సుందరవేణికి రక్షితామర
శ్రేణికిఁ
దోయజాతభవ చిత్త వశీకరణైక వాణికిన్
వాణికి నక్షదామ శుక వారిజ పుస్తక రమ్య పాణికిన్.
kshONitalaMbunan nuduru sO@Mka@Mga mrokki nutiMtu saikata
SrONiki@M
jaMcarIka caya suMdaravENiki rakshitAmara
SrENiki@M
dOyajAtabhava citta vaSIkaraNaika vANikin
vANiki nakshadAma Suka vArija pustaka ramya pANikin.
కార్యపత్రం (Worksheet)
కార్యపత్రం, పద్యసహితం (Worksheet with padyam)