పోతన భాగవత పరిమళం

"ఎచ్చటఁ బుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికిన్" [7.46]

తరగతి క్రమము 11   Prev  /  Next

చేతులారంగ శివుని పూజింపడేని
నోరు నొవ్వంగ హరికీర్తి నుడువడేని
దయయు సత్యంబు లోనుగా దలపడేని
గలుగ నేటికి దల్లుల కడుపు జేటు.
ఛందస్సు (Meter): తేటగీతి
స్కంధము (Chapter): 1
సంఖ్య (Number): 14
వ్యాఖ్య
చేతులు + ఆరంగ = చేతులు మొద్దుబారునట్లు;
శివుని = శివుని;
పూజింపడేని = పూజ చేయనట్టి వాడు;
నోరు నొవ్వంగ = నోరు నొప్పెట్టు నట్లు;
హరి కీర్తి = హరి నామ కీర్తనలను;
నుడువడేని = పలుకనట్టి వాడు;
దయ యు = దయ (kindness, compassion, sympathy, mercy, affection) మఱియు;
సత్యంబు = సత్యము (truthfulness) ;
లోనుగా = తన మనస్సు లో;
తలపడేని = తలచనట్టివాడు;
కలుగ నేటికి = పుట్టుట ఎందులకు?;
తల్లుల = (అటువంటి వారి) తల్లుల యొక్క;
కడుపు జేటు = గర్భము వృధా (అనగా అటువంటి సద్గుణములు లేని వారలను కని పెంచిన శ్రమ వృధా అని అర్ధము).
సాధన
చేతులారంగ శివుని పూజింపడేని
నోరు నొవ్వంగ హరికీర్తి నుడువడేని
దయయు సత్యంబు లోనుగా దలపడేని
గలుగ నేటికి దల్లుల కడుపు జేటు.
cEtulAraMga Sivuni pUjiMpaDEni
nOru novvaMga harikIrti nuDuvaDEni
dayayu satyaMbu lOnugA dalapaDEni
galuga nETiki dallula kaDupu jETu.
కార్యపత్రం (Worksheet)
కార్యపత్రం, పద్యసహితం (Worksheet with padyam)