పోతన భాగవత పరిమళం

"ఎచ్చటఁ బుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికిన్" [7.46]

అక్షర క్రమము 25   Prev  /  Next

(తరగతి క్రమము 76)
ఇవ్విధంబునఁ గర్మంబులు సంసారహేతుకంబు లయ్యు
నీశ్వరార్పితంబులై తమ్ము తాముఁ జెఱుపుకొన నోపియుండు;
నీశ్వరునియందుఁ జేయంబడు కర్మంబు విజ్ఞానహేతుకంబై
నీశ్వర సంతోషణంబును భక్తి యోగంబునుం బుట్టించు;
నీశ్వరశిక్షంజేసి కర్మంబులు సేయువారలు
కృష్ణగుణ నామవర్ణన స్మరణంబులు సేయుదురు;
ఛందస్సు (Meter): వచనము
స్కంధము (Chapter): 1
సంఖ్య (Number): 110
ఈ వచనము ఈ క్రింది సంస్కృత శ్లోకములకు పోతనగారు చేసిన తెలుగు అనువాదము:

ఏవం నౄణాం క్రియాయోగాః సర్వే సంస్తుతిహేతవః।
త ఏవాత్మవినాశాయ కల్పంతే కల్పితాః పరే ॥
యదత్ర క్రియతే కర్మ భగత్పరితోషణమ్।
జ్ఞానం యత్తదధీనం హి భక్తియోగసమన్వితమ్ ॥
కృర్వాణా యత్ర కర్మాణి భగవచ్ఛిక్షయాసకృత్।
గుణంతి గుణనామాని కృష్ణస్యానుస్మరంతి చ ॥
వ్యాఖ్య
[నారదుడు వ్యాసునకు ఈ విధముగా బోధించెను:] మనసుకు కలుగు వ్యధలు లేదా బాధలు మూడురకములని చెప్పబడినది; అవి తాపత్రయములు: (1) ఆధిభౌతికము - భౌతికముల ద్వారా కలిగినవి (natural causes), (2) ఆధిదైవికము - దైవిముగా కలిగినవి (accidental or supernatural, (3) ఆధ్యాత్మికము - ఆత్మ ద్వారా కలిగినవి (matters related to the soul). మానవుడు చేయు కర్మను దైవమునకు అర్పించినయెడల ఆ కార్యము ఈ మూడు వ్యధలనుండి విముక్తి యగుటకు ఔషధమగా మారును.
సాధన
ఇవ్విధంబునఁ గర్మంబులు సంసారహేతుకంబు లయ్యు
నీశ్వరార్పితంబులై తమ్ము తాముఁ జెఱుపుకొన నోపియుండు;
నీశ్వరునియందుఁ జేయంబడు కర్మంబు విజ్ఞానహేతుకంబై
నీశ్వర సంతోషణంబును భక్తి యోగంబునుం బుట్టించు;
నీశ్వరశిక్షంజేసి కర్మంబులు సేయువారలు
కృష్ణగుణ నామవర్ణన స్మరణంబులు సేయుదురు;
ivvidhaMbuna@M garmaMbulu saMsArahEtukaMbu layyu
nISvarArpitaMbulai tammu tammu@M je~rupukona nOpiyuMDu;
nISvaruniyaMdu@m jEyaMbaDu karmaMbu vij~nAnahEtukaMbai
nISvara saMtOshaNaMbunu bhakti yOgMbunuM buTTTiMcu;
nISvaraSikshaMjEsi karmaMbulu sEyuvAralu
kRshNaguNa nAmavarNana smaraNaMbulu sEyuduru;
కార్యపత్రం (Worksheet)
కార్యపత్రం, పద్యసహితం (Worksheet with padyam)