పోతన భాగవత పరిమళం

"ఎచ్చటఁ బుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికిన్" [7.46]

తరగతి క్రమము 91   Prev  /  Next

సృష్టిచే నెవ్వఁడు చేతనపడకుండు? సృష్టి యెవ్వని చేఁతచే జనించు?
జగములు నిద్రింప జాగరూకతనొంది యెవ్వఁడు బ్రహ్మాండ మెఱుఁగుచుండు?
నాత్మకాధారంబు నఖిలంబు నెవ్వఁడౌ? నెవ్వని నిజధనంబింతవట్టు?
బొడగాన రాకుండఁ బొడగను నెవ్వడే నెవ్వని దృష్టికి నెదురు లేదు?

జననవృద్ధి విలయ సంగతిఁ జెందక
యెవ్వఁ డెడపకుండు? నెల్ల యెడల
దన మహత్త్వసంజ్ఞఁ దత్త్వ మెవ్వఁడు? దాన
విశ్వరూపుఁ డనఁగ విస్తరిల్లు?
ఛందస్సు (Meter): సీసము, ఆటవెలది
స్కంధము (Chapter): 8
సంఖ్య (Number): 10
ఈ పద్యము, తరువాతి వచనము ఈ క్రింది సంస్కృత శ్లోకములకు పోతనగారు చేసిన తెలుగు అనువాదము.

ఏన చేతయతే విశ్వం విశ్వం చేతయతే న యమ్।
యో జాగర్తి శయానేऽస్మిన్నాయం తం వేద వేద సః॥
ఆత్మావాస్యమిదం విశ్వం యత్ కిఞ్చజ్జగత్యాం జగత్।
తేన త్యక్తేన భుఞ్జీథా మా గృధః కస్యస్విద్ధనమ్ ॥
యం పశ్యతి న పశ్యంతం చక్షుర్యస్య న రిష్యతి।
తం భూతనిలయం దేవం సుపర్ణముపధావత॥
న యస్యాద్యంతౌ మధ్యం చ స్వః పరో నాంతరం బహిః।
విశ్వస్యామూని యద్ యస్మాద్ విశ్వం చ తదృతం మహత్ ॥
స విశ్వకాయః పురూహుత ఈశః సత్యః స్వయంజ్యోతిరజః పురాణః।
ధత్తేऽస్యజన్మాద్యజయాత్మశక్త్యా విద్యయోదస్య నిరీహ ఆస్తే ॥
తమీహమానం నిరగఙ్కృతం బుధం నిరాశిషం పూర్ణమనన్యచోదినమ్ ।
నృఙ్ శిక్షయంతం నిజవర్త్మసంస్థితం ప్రభుం ప్రపద్యేఖిలధర్మభావనమ్॥
వ్యాఖ్య
ప్రథమ మనువైన స్వాయంభువ మనువు "కామభోగ విరతిన్" భూభారమును విడిచి, తన భార్య శతరూప తో సునందానదికి సమీపములో వ్రతమును ఆచరించి, "ఏకపథస్థుడై" (8.8) తపస్సు చేయుచు తన మనస్సులో ఈ విధముగా ప్రార్థించెనని సూతుడు చెప్పెను.
సాధన
సృష్టిచే నెవ్వఁడు చేతనపడకుండు? సృష్టి యెవ్వని చేఁతచే జనించు?
జగములు నిద్రింప జాగరూకతనొంది యెవ్వఁడు బ్రహ్మాండ మెఱుఁగుచుండు?
నాత్మకాధారంబు నఖిలంబు నెవ్వఁడౌ? నెవ్వని నిజధనంబింతవట్టు?
బొడగాన రాకుండఁ బొడగను నెవ్వడే నెవ్వని దృష్టికి నెదురు లేదు?

జననవృద్ధి విలయ సంగతిఁ జెందక
యెవ్వఁ డెడపకుండు? నెల్ల యెడల
దన మహత్త్వసంజ్ఞఁ
దత్త్వ మెవ్వఁడు? దాన
విశ్వరూపుఁ డనఁగ విస్తరిల్లు?
sRshTicE nevva@MDu cEtanapaDakuMDu? sRshTi yevvani cE@MtacE janiMcu?
jagamulu nidriMpa jAgarUkatanoMdi yevva@MDu brahmAMDa me~ru@MgucuMDu?
nAtmakAdhAraMbu nakhilaMbu nevva@MDau? nevvani nijadhanaMbiMtavaTTu?
boDagAna rAkuMDa@M boDaganu nevvaDE nevvani dRshTiki neduru lEdu?

jananavRddhi vilaya saMgati@M jeMdaka
yevva@M DeDapakuMDu nella yeDala?
dana mahattvasamj~na@M
dattva mevva@MDu dAna
viSvarUpu@M Dana@Mga vistarillu?
కార్యపత్రం (Worksheet)
కార్యపత్రం, పద్యసహితం (Worksheet with padyam)