పోతన భాగవత పరిమళం

"ఎచ్చటఁ బుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికిన్" [7.46]

గ్రంథ క్రమము 35   Prev  /  Next

(తరగతి క్రమము 68)
అరూపుండయి చిదాత్మకుండయి పరగు జీవునికిం
బరమేశ్వరు మాయాగుణంబులైన మహదాదిరూపంబులచేత
నాత్మస్థానంబుగా స్థూలశరీరంబు విరచితంబు [బైన]..
ఛందస్సు (Meter): వచనము
స్కంధము (Chapter): 1
సంఖ్య (Number): 67
ఈ వచనము ఈ క్రింది సంస్కృత శ్లోకమునకు పోతనగారు చేసిన తెలుగు అనువాదము.

एतद्रूपं भगवतो ह्यरूपस्य चिदात्मनः।
मायागुणैर्विरचितं महदादिभिरात्मनि॥

ఏతద్రూపం భగవతో హ్యరూపస్య చిదాత్మనః।
మాయాగుణైర్విరచితం మహదాదిభిరాత్మని ॥
వ్యాఖ్య
[సూతుడు శౌనకాది మునులతో భాగవతారంభములో ఈ విధముగా పలికెను:]

అరూండయి = నిరాకారముతో;
చిదాత్మకుండయి = (మన) చిత్తములో ఆత్మస్వరూపమున;
పరగు = ఉన్న;
జీవునికిం = (పరమాత్మ అంశ అయిన) జీవునికి;
పరమేశ్వరు మాయాగుణంబులైన = పరమేశ్వరుని మాయాగుణంబులయిన;
మహదాదిరూపంబులచేత = ప్రకృతి మొదలయిన రూపములచేత;
ఆత్మస్థానంబుగా = ఆత్మ కేంద్రమై;
స్థూలశరీరంబు = (కనులకు కనిపించు) ఆకారము తోగూడిన శరీరము;
విరచితంబు = వ్యక్తము అయినది.
సాధన
అరూపుండయి చిదాత్మకుండయి పరగు జీవునికిం
బరమేశ్వరు మాయాగుణంబులైన మహదాదిరూపంబులచేత
నాత్మస్థానంబుగా స్థూలశరీరంబు విరచితంబు [బైన]..
arUpuMDayi cidAtmakuMDayi paragu jIvunikiM
baramESvaru mAyAguNaMbulaina mahdAdirUpaMbulacEta
nAtmasthAnaMbugA sthUlaSarIraMbu viracitaMbu [baina]...
కార్యపత్రం (Worksheet)
కార్యపత్రం, పద్యసహితం (Worksheet with padyam)