పోతన భాగవత పరిమళం

"ఎచ్చటఁ బుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికిన్" [7.46]

αβ'cal 75   Prev  /  Next

(తరగతి క్రమము 141)
జనులకెల్ల శుభము సాంఖ్య యోగము; దాని
వలన ధర్మనిష్ఠవలన నయిన
నంత్యకాలమందు హరిచింత సేయుట
పుట్టువులకు ఫలము భూవరేంద్ర
ఛందస్సు (Meter): వచనము
స్కంధము (Chapter): 2
సంఖ్య (Number): 5
"కరుణ తోడ జెప్పవే తండ్రి ముక్తికి జేరు తెరువు" [1.526] అని పరీక్షిత్తు మహరాజు శుకమహర్షిని అభ్యర్థించగా, శుకుడు యోగమార్గమును తెలుపనారంభించి, ఇట్లు పలికెను. ఈ పద్యము ఈ క్రింది సంస్కృత శ్లోకమునకు పోతనగారు చేసిన తెలుగు అనువాదము.

एतावान् सांख्ययोगाभयां स्वधर्मपरिनिष्ठया ।
जन्मलाभः परः पुंसामन्ते नारायणस्मृतिः ॥

ఏతావాన్ సాంఖ్యయోగాభ్యాం స్వధర్మపరినిష్ఠయా ।
జన్మలాభః పరః పుంసామన్తే నారాయణస్మృతిః ॥
వ్యాఖ్య
జనులకెల్ల శుభము = జనులకు శుభము కలిగించునది;
సాంఖ్య యోగము = సాంఖ్య యోగము;
దానివలన = ఆ మార్గమును అనుసరించుట వలన కాని;
ధర్మనిష్ఠవలన నయిన = ధర్మ మార్గమును అనుసరించి కాని;
అంత్యకాలమందు = మానవుని చివరి దశలో;
హరిచింత సేయుట = [నిరాకారుడు, నిర్గుణుడు అయిన] భగవంతుని చింతించుట యే;
పుట్టువులకు ఫలము = పుట్టిన జన్మకు సఫలము లేదా సార్ధకత్వము (the ulitmate purpose of life);
భూవరేంద్ర = రాజులలో ఇంద్రుడి వంటి వాడా [ఓ పరీక్షిన్మహరాజా!]
సాధన
జనులకెల్ల శుభము సాంఖ్య యోగము; దాని
వలన
ధర్మనిష్ఠవలన నయిన
నంత్యకాలమందు హరిచింత సేయుట
పుట్టువులకు ఫలము భూవరేంద్ర
janulakella Subhamu sAMkhya yOgamu; dAni
valana
dharmanishThavalana nayina
naMtyakAlamaMdu hariciMta sEyuTa
puTTuvulaku phalamu bhUvarEMdra
కార్యపత్రం (Worksheet)