పోతన భాగవత పరిమళం

"ఎచ్చటఁ బుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికిన్" [7.46]

αβ'cal 70   Prev  /  Next

(తరగతి క్రమము 14)
జగదధినాథుఁడైన హరి సంతత లీలలు నామరూపముల్
దగిలి మనోవచోగతులఁ దార్కిక చాతురి యెంత గల్గినన్
మిగిలి కుతర్కవాది తగ మేరలు సేసి యెఱుంగ నేర్చునే?
యగణిత నర్తనక్రమము నజ్ఞుఁ డెఱింగి నుతింప నోఁపునే?
ఛందస్సు (Meter): చంపకమాల
స్కంధము (Chapter): 1
సంఖ్య (Number): 70
ఈ పద్యము ఈ క్రింది శ్లోకానికి పోతనగారు చేసిన అనువాదము:

न चास्य कश्चिन्निपुणेन धातु रवैति जन्तुः कुमनीषा ऊतिः।
नामानि रूपाणि मनोवचोभिः सन्तानवतो नटचर्यामिवाज्ञः॥

న చాస్య కశ్చిన్నిపుణేన ధాతు రవైతి జంతుః కుమనీష ఊతీః ।
నామాని రూపాణి మనోవచోభిః సంతన్వతో నటచర్యామి వాజ్ఞః ॥
వ్యాఖ్య
జగత్ = లోకమునకు;
అధినాథుడైన హరి = ఈశ్వరుడైన హరి;
సంతత లీలలు = ఎడతెగని ఆటలు/పనులు;
నామరూపముల్ = పేరులు, స్వభావములు/ఆకారములు (forms);
తగిలి = ఆసక్తితో;
మనోవచోగతుల = మానసికమైన లేదా మాట బలముతో కూడిన;
తార్కిక చాతురి యెంత గల్గినన్ = ఎంత శాస్త్ర నైపుణ్యము కలిగినప్పటి;
మిగిలి = చివరకు;
కుతర్కవాది = మొండిగా వాదించువాడు;
తగ మేరలు చేసి = సరైన క్రమములో;
ఎఱుంగ నేర్చునే = తెలిసికొన గలుగునా? (అనగా తెలిసికొనలేడు అని అర్ధము);
అగణిత = [అదే విధంగా] లెక్కలేనన్ని;
నర్తనక్రమము = (ఆ భగవంతుని) ఆట విధానము లేదా నాటకములో పాత్రధారునివలె చేయు పనులు;
అజ్ఞుడు = తెలియనివాడు లేదా మూర్ఖుడు;
ఎఱింగి నుతింపనోపునే = తెలిసికొని పొగడ/ప్రశంసించ గలడా? (అనగా పొగడ/ప్రశంసించ లేడని అర్ధము - cannot appreciate).
సాధన
జగదధినాథుఁడైన హరి సంతత లీలలు నామరూపముల్
దగిలి మనోవచోగతులఁ దార్కిక చాతురి యెంత గల్గినన్
మిగిలి కుతర్కవాది తగ మేరలు సేసి యెఱుంగ నేర్చునే?
యగణిత నర్తనక్రమము నజ్ఞుఁ డెఱింగి నుతింప నోఁపునే?
jagadadhinAthu@MDaina hari saMtata lIlalu nAmarUpamul
dagili manOvacOgatula@M dArkika cAturi yeMta galginan
migili kutarkavAdi taga mEralu sEsi ye~ruMga nErcunE
yagaNita nartanakramamu najnu@M De~riMgi nutiMpa nO@MpunE!
కార్యపత్రం (Worksheet)
కార్యపత్రం, పద్యసహితం (Worksheet with padyam)