పోతన భాగవత పరిమళం

"ఎచ్చటఁ బుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికిన్" [7.46]

అక్షర క్రమము 38   Prev  /  Next

(తరగతి క్రమము 64)
ఏక వింశతి తమంబైన బుద్ధనామధేయంబునం
గలియుగాద్యవసరంబున రాక్షస సమ్మోహనంబు కొఱకు
మధ్యగయా ప్రదేశంబున జినసుతుండయి తేజరిల్లు;
యుగసంధియందు వసుంధరాధీశులు చోరప్రాయులై సంచరింప
విష్ణుయశుండను విప్రునికిఁ గల్కి యను పేర నుద్భవింపఁగలండు [డని యిట్లనియె].
ఛందస్సు (Meter): వచనము
స్కంధము (Chapter): 1
సంఖ్య (Number): 63
ఈ వచనము ఈ క్రింది రెండు సంస్కృత శ్లోకములకు పోతనగారు చేసిన తెలుగు అనువాదము.

ततःकालौ संप्रव्रुत्ते सम्मोहाय सुरद्विषाम्।
बुद्धौ नाम्नाजनसुतः कीकटेषु भविष्यति ॥
अथासौ युगसंध्यायं दस्युप्रायेषु राजसु ।
जनिता विश्णुयशसौ नाम्ना कल्किर्जगत्पतिः ॥

తతః కాలౌ సంప్రవృత్తే సమ్మోహాయ సురద్విషాం।
బుద్ధో నామ్నాజనసుతః కీకతేషు భవిష్యతి ॥
అథాసౌ యుగసంధ్యాయాం దస్యుప్రాయేషు రాజసు।
జనితా విష్ణుయశసో నామ్నా కల్కిర్జగత్పతిః ॥
వ్యాఖ్య
[సూతుడు భాగవత కథారంభములో శౌనకాది మునులకు ఈ విధముగా విష్ణు అవతారములగురించి చెప్పెను.]

ఏకవింశతి = ఇరవై ఒకటవ;
తమము = గుణము;
సమ్మోహనంబు కొఱకు = భ్రమను కలిగించుట కొఱకు;
జినసుతుండు = విష్ణువు రూపమయి;
వసుంధరాధీశులు = రాజులు;
చోరప్రాయులై = యవ్వనములో;
సాధన
ఏక వింశతి తమంబైన బుద్ధనామధేయంబునం
గలియుగాద్యవసరంబున రాక్షస సమ్మోహనంబు కొఱకు
మధ్యగయా ప్రదేశంబున జినసుతుండయి తేజరిల్లు;
యుగసంధియందు వసుంధరాధీశులు చోరప్రాయులై సంచరింప
విష్ణుయశుండను విప్రునికిఁ గల్కి యను పేర నుద్భవింపఁగలండు [డని యిట్లనియె].
Eka viMSati tamaMbaina buddhanAmadhEyaMbunaM
galiyugAdyavasaraMbuna rAkshasa sammOhanaMbu ko~raku
madhyagayA pradESaMbuna jinasutuMDayi tEjarillu;
yugasaMdhiyaMdu vasuMdharAdhISulu cOraprAyulai saMcariMpa
vishNuyaSuMDanu vipruniki@M galki yanu pEra nudbhaviMpa@MgalaMDu [Dani yiTlaniye].
కార్యపత్రం (Worksheet)
కార్యపత్రం, పద్యసహితం (Worksheet with padyam)