పోతన భాగవత పరిమళం

"ఎచ్చటఁ బుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికిన్" [7.46]

αβ'cal 110   Prev  /  Next

(తరగతి క్రమము 37)
నినుఁ జింతించుచుఁ బాడుచుం బొగడుచున్ నీ దివ్యచారిత్రముల్
వినుచుం జూతురుగాక లోకు లితరాన్వేషంబులం జూతురే
ఘన దుర్జన్మ పరంపరా హరణ దక్షంబై మహాయోగి వా
గ్వినుతంబైన భవత్పాదాబ్జయుగమున్ విశ్వేశ! విశ్వంభరా!
ఛందస్సు (Meter): మత్తేభము
స్కంధము (Chapter): 1
సంఖ్య (Number): 197
కుంతీదేవి శ్రీ కృష్ణుని ఈ విధముగా వేడుకొనెను.

शृण्वन्ति गायन्ति गृणन्त्यभीक्ष्णशः स्मरन्ति नन्दन्ति तवेहितं जनाः ।
त एव पश्यन्त्यचिरेण तावकं भवप्रवाहोपरमं पदाम्बुजम् ॥

శృణ్వన్తి గాయన్తి గృణన్త్యభీక్ష్ణశః స్మరన్తి నన్దన్తి తవేహితం జనాః |
త ఏవ పశ్యన్త్యచిరేణ తావకం భవప్రవాహోపరమం పదామ్బుజమ్ ||
వ్యాఖ్య
నినుఁ జింతించుచుఁ = నీ గురించి స్మరించుచు;
పాడుచుం = (నిను వర్ణించు) పాటలను పాడుచు;
బొగడుచున్ = (నీయొక్క మహత్వమును) ప్రశసించుచు;
నీ దివ్యచారిత్రముల్ వినుచుం = నీ అత్యుత్తమమైన కథలను వినుచు;
చూతురుగాక లోకుల్ = (ఉన్నప్పుడు మాత్రమే నిన్ను) జనులు చూడగలరు;
ఇతరాన్వేషంబులం జూతురే = ఏ ఇతర మార్గములలోనూ చూడజాలరు;

ఘన దుర్జన్మ పరంపరా = విపరీతమైన, హీనమైన జన్మల వరుసలను;
హరణ దక్షంబై = తొలగించగల శక్తి కలిగినది;
మహాయోగి వాగ్వినుతంబైన = మహా యోగుల పలుకులచే కొనియాడబడినది;
భవత్పాదాబ్జయుగమున్ = నీ పాద పద్మముల (సేవ);
విశ్వేశ = విశ్వమును పరిపాలించు వాడవు కదా నీవు!
విశ్వంభరా = విశ్వమును భరించెడి వాడవుకదా నీవు!
సాధన
నినుఁ జింతించుచుఁ బాడుచుం బొగడుచున్ నీ దివ్యచారిత్రముల్
వినుచుం జూతురుగాక లోకు
లితరాన్వేషంబులం జూతురే
ఘన దుర్జన్మ పరంపరా హరణ దక్షంబై మహాయోగి వా
గ్వినుతంబైన
భవత్పాదాబ్జయుగమున్ విశ్వేశ! విశ్వంభరా!
ninu@M jiMtiMcucu@M bADucuM bogaDucun nI divyacAritramul
vinucuM jUturugAka lOku
litarAnvEshaMbulaM jUturE
ghana durjanma paraMparA haraNa dakshaMbai mahAyOgi vA
gvinutaMbaina
bhavatpAdAbjayugamun viSvESa! viSvaMbharA!
కార్యపత్రం (Worksheet)
కార్యపత్రం, పద్యసహితం (Worksheet with padyam)