పోతన భాగవత పరిమళం

"ఎచ్చటఁ బుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికిన్" [7.46]

αβ'cal 15   Prev  /  Next

(తరగతి క్రమము 25)
అపచారంబులు లేక నిత్యపరిచర్యాభక్తి యుక్తుండనై
చపలత్వంబును మాని నేఁగొలువగా సంప్రీతులై వారు ని
ష్కపటత్వంబున దీనవత్సలతతోఁ గారుణ్య సంయుక్తులై
యుపదేశించిరి నాకు నీశ్వరరహస్యోదార విజ్ఞానమున్.
ఛందస్సు (Meter): మత్తేభము
స్కంధము (Chapter): 1
సంఖ్య (Number): 109
ఈ పద్యం ఈ క్రింది రెండు శ్లోకములకు పోతనగారు చేసిన అనువాదము:

तस्यैवं मेऽनुरक्तस्य प्रश्रितस्य हतैनसः ।
श्रद्दधानस्य बालस्य दान्तस्यानुचरस्य च ॥
ज्ञानं गुह्यतमं यत्तत्साक्षाद्भगवतोदितम् ।
अन्ववोचन् गमिष्यन्तः कृपया दीनवत्सलाः ॥

తస్యైవం మేనురక్తస్య ప్రశ్రితస్య హతైనసః ।
శ్రద్దధానస్య బాలస్య దాంతస్యానుచరస్య చ ॥
జ్ఞానం గుహ్యతమం తత్తత్సాక్షాద్భగవతోదితం ।
అన్వవోచన్ గమిష్యంతః కృపయా దీనవత్సలాః ॥
వ్యాఖ్య
నారదడు వ్యాసునితో పలికెను:

అపచారంబులు లేక = పెద్దలయెడ ఎటువంటి అపరాధము లేకుండగ;
నిత్యపరిచర్యాభక్తి యుక్తుండనై = ప్రతి దినము శ్రద్ధ, గౌరవములతో కూడిన పరిచర్యలను కలిగినవాడనై;
చపలత్వంబును మాని = చంచలమైన (నిలకడలేని) బుద్ధిని మానుకొని;
నేఁగొలువగా సంప్రీతులై = నేను సేవచేయగా, సంతోషముతో; వారు = ఆ వేద వేత్తలు;
నిష్కపటత్వంబున = మోసములేకుండగ (ప్రవర్తించి);
దీనవత్సలతతోఁ = దీనుడనైన నాయందు ప్రేమతో;
కారుణ్య సంయుక్తులై = దయ కలిగి;
ఉపదేశించిరి నాకు = నాకు చెప్పెను;
ఈశ్వరరహస్యోదార విజ్ఞానమున్ = భగవంతుని రహస్యమైన, ఉదారమైన విజ్ఞానమును.

భగవంతునియందు భక్తి కలుగుటకు కావలసిన గుణములు నారదుని పూర్వజన్మ వృత్తాంతముద్వారా మనకు తెలియుచున్నవి. తనకు భక్తి ఏవిధముగా అలవడినదో నారదుడు తన పూర్వ జన్మ వృత్తాంతము ద్వారా వ్యాసునికి చెప్పెను. తను పూర్వ జన్మలో ఒక దాసీ పుత్రుడనని, తన తల్లితో పాటు తను కూడా వేదవేత్తల ఇండ్లలో పని చేసుకొనెడివాడని చెప్పెను. అప్పుడు ఆయన అనవసరమైన ఆటపాటలను వదలి, నిత్యము శ్రద్ధతో సేవలు చేసి, భగవంతుని కథలను, కీర్తనలను వినగా క్రమమున ఇతర విషయములకు దూరమై హరి సేవపై ఆసక్తి ఏర్పడెనని చెప్పెను.
సాధన
అపచారంబులు లేక నిత్యపరిచర్యాభక్తి యుక్తుండనై
చపలత్వంబును మాని నేఁగొలువగా సంప్రీతులై వారు ని
ష్కపటత్వంబున
దీనవత్సలతతోఁ గారుణ్య సంయుక్తులై
యుపదేశించిరి నాకు నీశ్వరరహస్యోదార విజ్ఞానమున్.
apacAraMbulu lEka nityaparicaryAbhakti yuktuMDanai
capalatvaMbunu mAni nE@MgoluvagA saMprItulai vAru ni
shkapaTatvaMbuna
dInavatsalatatO@M gAruNya saMyuktulai
yupadESiMciri nAku
nISvararahasyOdAra vij~nAnamun.
కార్యపత్రం (Worksheet)
కార్యపత్రం, పద్యసహితం (Worksheet with padyam)