పోతన భాగవత పరిమళం

"ఎచ్చటఁ బుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికిన్" [7.46]

తరగతి క్రమము 67   Prev  /  Next

సరసిం బాసినఁ వేయు కాలువల యోజన్ విష్ణునందైన శ్రీ
కర నానా ప్రకటావతారము లసంఖ్యాతంబు లుర్వీశులున్
సురలున్ బ్రాహ్మణ సంయమీంద్రులు మహర్షుల్ విష్ణునంశాంశజుల్
హరి కృష్ణుండు బలానుజన్ముఁ డెడలే దా విష్ణుఁడౌ నేర్పడన్.
ఛందస్సు (Meter): మత్తేభము
స్కంధము (Chapter): 1
సంఖ్య (Number): 64
ఈ పద్యము ఈ క్రింది సంస్కృత శ్లోకములకు పోతనగారు చేసిన తెలుగు అనువాదము.

అవతారాహ్యసంఖ్యేయా హరేః సత్త్వనిధేర్ద్విజాః।
యథావిదాసినః కుల్యాః సరసః స్యుః సహస్రశః॥
ఋషయో మనవో దేవా మనుపుత్రా మహౌజనః।
కలాః సర్వే హరేరేవ సప్రజాపతయస్తథా॥
ఏతేచాంశకలాః పుంసః కృష్ణస్తు భగవాన్ స్వయం।
ఇంద్రాదివ్యాకులం లోకం మృదయంతి యుగే యుగే ॥
వ్యాఖ్య
[సూతుడు ఈ విధముగా చెప్పెను:]

సరసిం బాసినఁ = సరస్సు నుండి వెలువడిన;
వేయు కాలువల యోజన్ = వేయి కాలువల వలే;
విష్ణునందైన శ్రీ కర నానా ప్రకటావతారముల్ = విష్ణువుయొక్క శుభప్రదమైన అనేక ప్రసిద్ధమైన అవతారములు;
అసంఖ్యాతంబుల్ = లెక్కింపలేనన్ని;
ఉర్వీశులున్ = రాజులు;
సురలున్ = దేవతలు;
బ్రాహ్మణ = బ్రాహ్మణులు;
సంయమీంద్రులు = ఇంద్రియములను అణచుకొనినవారు [యోగులు];
మహర్షుల్ = మహా ఋషులు;
విష్ణునంశాంశజుల్ = [వీరందరు కూడా] విష్ణువుయొక్క అంశవలన జనించినవారు;
హరి = [కాని ఆ] హరి;
కృష్ణుండు బలానుజన్ముఁ డు = కృష్ణుడు, తన తమ్ముడైన (అనుజన్ముడు) బలరాముడు గా ;
ఎడలే = వేరైన వారుగా [జన్మించి];
తా విష్ణుఁడౌ నేర్పడన్ = సాక్షాత్తూ ఆ విష్ణువే ఆ రూపములోనున్నారు.
సాధన
సరసిం బాసినఁ వేయు కాలువల యోజన్ విష్ణునందైన శ్రీ
కర నానా ప్రకటావతారము
లసంఖ్యాతంబు లుర్వీశులున్
సురలున్
బ్రాహ్మణ సంయమీంద్రులు మహర్షుల్ విష్ణునంశాంశజుల్
హరి కృష్ణుండు బలానుజన్ముఁ డెడలే దా విష్ణుఁడౌ నేర్పడన్.
sarasiM bAsina@M vEyu kAluvala yOjan vishNunaMdaina SrI
kara nAnA prakaTAvatAramu
lasaMkhyAtaMbu lurvISulun
suralun
brAhmaNa saMyamIMdrulu maharshul vishNunaMSAMSajul
hari kRshNuMDu balAnujanmu@M DeDalE dA vishNu@MDau nErpaDan.
కార్యపత్రం (Worksheet)
కార్యపత్రం, పద్యసహితం (Worksheet with padyam)