పోతన భాగవత పరిమళం

"ఎచ్చటఁ బుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికిన్" [7.46]

గ్రంథ క్రమము 67   Prev  /  Next

(తరగతి క్రమము 47)
భక్తధనుండును, నివృత్తధర్మార్థకామ విషయుండును,
ఆత్మారాముండును, రాగాదిరహితుండును,
గైవల్యదాన సమర్థుండును, గాలరూపకుండును,
నియామకుండును, నాద్యంతశూన్యుండును,
విభుండును, సర్వసముండును,
సకల భూతనిగ్రహానుగ్రహకరుండును
నైన నిన్నుఁ దలంచి నమస్కరించెద నవధరింపుము.
ఛందస్సు (Meter): వచనము
స్కంధము (Chapter): 1
సంఖ్య (Number): 191
కుంతీదేవి శ్రీకృష్ణుని ఈవిధముగా స్తుతించెను. ఈ వచనములు ఈ క్రింది రెండు శ్లోకములకు పోతనగారు చేసిన అనువాదము:

नमोऽकिंचनवित्ताय निवृत्तगुणवृत्तये ।
आत्मारामाय शान्ताय कैवल्यपतये नमः ॥
मन्ये त्वां कालमीशानामनादिनिधनं विभुम्।
समं चरन्तं सर्वत्र भूतानां यन्मिथः कलिः ॥

నమోऽకించనవిత్తాయ నివృత్తగుణవృత్తయే।
ఆత్మారామాయ శాంతాయ కైవల్యపతయే నమః ॥
మన్యే త్వాం కాలమీశానామనాదినిధనం విభుం ।
సమం చరంతం సర్వత్ర భూతానాం యన్మిథః కలిః ॥
వ్యాఖ్య
భక్తధనుండును = [నీవు] భక్తులకు ధనము (గా నున్న వాడవు);
నివృత్తధర్మార్థకామ విషయుండును = ధర్మము, ధనము, కామము (వీటిమీడ మోహమును) తొలగించు వాడవు;
ఆత్మారాముండును = ఆత్మయందే రమించువాడవు;
రాగాదిరహితుండును = (మోహముతో కూడిన) ప్రేమ మొదలయినవి లేనివాడవు;
కైవల్యదాన సమర్థుండును = మోక్షమును ప్రసాదించు నేర్పుగలవాడవు;
కాలరూపకుండును = కాలమే నీవైయున్న వాడవు;
నియామకుండును = (జగమును పరిపాలించే) నియంతవు;
ఆద్యంతశూన్యుండును = పుట్టుక, మరణము లేనివాడవు (లేదా) మొదలు, చివర లేని వాడవు;
విభుండును = సర్వము వ్యాపించినవాడవు;
సర్వసముండును = (అందరిని) సమముగా చూసేవాడవు;
సకల భూతనిగ్రహ - అనుగ్రహకరుండును = అన్ని జీవులకు ఆవేశములను నిగ్రహించి, (అధోగతిచెందకుండ) అనుగ్రహించేవాడవు;
ఐన నిన్నుఁ దలంచి నమస్కరించెద = అటువంటి నిన్ను తలచి నమస్కరించెదను;
అవధరింపుము = (ఓ కృష్ణా) వినుము.
సాధన
భక్తధనుండును, నివృత్తధర్మార్థకామ విషయుండును,
ఆత్మారాముండును, రాగాదిరహితుండును,
గైవల్యదాన సమర్థుండును, గాలరూపకుండును,
నియామకుండును, నాద్యంతశూన్యుండును,
విభుండును, సర్వసముండును,
సకల భూతనిగ్ర హానుగ్రహకరుండును
నైన నిన్నుఁ దలంచి నమస్కరించెద నవధరింపుము.
bhaktadhanuMDunu, nivRttadharmArthakAma vishayuMDunu,
AtmArAmuMDunu, rAgAdirahituMDunu,
gaivalyadAna samarthuMDunu, gAlarUpakuMDunu,
niyAmakuMDunu, nAdyaMtaSUnyuMDunu,
vibhuMDunu, sarvasamuMDunu,
sakala bhUtanigra hAnugrahakaruMDunu
naina ninnu@M dalaMci namaskariMceda navadhariMpumu.
కార్యపత్రం (Worksheet)
కార్యపత్రం, పద్యసహితం (Worksheet with padyam)