పోతన భాగవత పరిమళం

"ఎచ్చటఁ బుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికిన్" [7.46]

αβ'cal 103   Prev  /  Next

(తరగతి క్రమము 52)
నారాయణ కథవలన నెయ్యే ధర్మంబులు దగులు వడ వవి నిరర్థకంబులు.
అపవర్గ పర్యంతంబయిన పరధర్మంబునకు
దృష్టశ్రుత ప్రపంచార్థంబు ఫలంబు గాదు.
ధర్మంబునందవ్యభిచారియైన యర్థంబునకుఁ గామంబు ఫలంబు గాదు.
విషయభోగంబైన కామంబున కింద్రియ ప్రీతి ఫలంబు గాదు.
ఎంత తడవు జీవించు నంతియ కామంబునకు ఫలంబు,
తత్త్వజిజ్ఞాసగల జీవునకుఁ గర్మంబులచేత నెయ్యది సుప్రసిద్ధం బదియు నర్థంబు గాదు;
ఛందస్సు (Meter): వచనము
స్కంధము (Chapter): 1
సంఖ్య (Number): 58
ఈ వచన భాగము ఈ క్రింది మూడు సంస్కృత శ్లోకములకు పోతనగారు చేసిన తెలుగు అనువాదము.

धर्मः स्वनुष्ठितः पुंसां विष्वक्सेनकथासु यः।
नोत्पादयेद्यदि रतिं श्रम एव हि केवलं॥
धर्मस्य ह्यापवर्गस्य नार्थोऽर्यायोपकल्पते।
नार्थस्य धर्मैकान्तस्य कामो लाभाय हि स्मृतः॥
कामस्य नेन्द्रियपीतिर्लाभो जीवेत यावता ।
जीवस्य तत्त्वजिज्ञासा नार्थो यश्चेह कर्मभिः॥

ధర్మః స్వనుష్ఠితః పుంసాం విష్వక్సేనకథాసు యః।
నోత్పాదయేద్యాది రతిం శ్రమ ఏవ హి కేవలం ॥
ధర్మస్య హ్యాపవర్గస్య నార్థోऽర్యాయోపకల్పతే ।
నార్థస్య ధర్మైకాంతస్య కామో లాభాయ హి స్మృతః ॥
కామస్య నేంద్రియప్రీతిర్లాభో జీవేత యావతా ।
జీవస్య తత్వ జిజ్ఞాసా నార్థో యశ్చేహ కర్మభిః ॥
వ్యాఖ్య
[భాగవత కథా ప్రారంభములో సూతుడు ఈ విధముగా చెప్పెను:] నారాయణ కథవలన - ఎయ్యే ధర్మంబులు - తగులు వడవు - అవి = (జీవుడు ఆచరించు) ఏ ధర్మములు భగవంతుని ధ్యేయముతో ముడిపడి ఉండవో అవి;

నిరర్థకంబులు = ప్రయోజనము లేనివి (అనగా పరధర్మమునకు పనికి రానివి);
అపవర్గ = అరిషడ్వర్గములకు దూరమైన అనగా మోక్షమార్గమునకు;
పర్యంతమైన = దగ్గరైన;
పరధర్మంబునకు = పరమ ధర్మమునకు;
దృష్ట-శ్రుత = కనిపించు, వినిపించు;
ప్రపంచార్థంబు = ప్రాపంచిక ప్రయోజనము;
ఫలంబు గాదు = ఫలితము కాదు;
ధర్మంబునందు - అవ్యభిచారియైన = నియమము అతిక్రమించకుండ పాటించుచున్న ధర్మమునకు;
అర్థంబునకు గామంబు ఫలంబు గాదు = కామము ఫలితము కాదు (అనగా కోరికలను మనసులో ఉంచుకొని ధర్మమార్గను అనుసరించరాదు అని అర్థము);
విషయభోగంబైన కామంబునకు - ఇంద్రియ ప్రీతి ఫలంబు గాదు = ప్రాపంచిక విషయములతో కూడిన భోగములు (ఆచరించవలసినప్పుడు వాటిని) ఇంద్రియ ప్రీతి కొఱకు చేయరాదు;
ఎంత తడవు జీవించు నంతియ కామంబునకు ఫలంబు = ప్రాపంచిక కామములు జీవితము చాలించు వరకు మాత్రమే ప్రయోజనములు;
తత్త్వజిజ్ఞాసగల జీవునకు = తత్వ జ్ఞానము తెలియగోరు జీవునకు;
కామంబులచేత నెయ్యది సుప్రసిద్ధంబు = కామములచేత కలుగు ఏ ఫలితముకూడా;
అదియు - అర్థంబు గాదు = (ఆ తత్వ జ్ఞానమునకు) ప్రయోజనము చేకూరదు.
సాధన
నారాయణ కథవలన నెయ్యే ధర్మంబులు దగులు వడ వవి నిరర్థకంబులు.
అపవర్గ పర్యంతంబయిన పరధర్మంబునకు
దృష్టశ్రుత ప్రపంచార్థంబు ఫలంబు గాదు.
ధర్మంబునందవ్యభిచారియైన యర్థంబునకుఁ గామంబు ఫలంబు గాదు.
విషయభోగంబైన కామంబున కింద్రియ ప్రీతి ఫలంబు గాదు.
ఎంత తడవు జీవించు నంతియ కామంబునకు ఫలంబు,
తత్త్వజిజ్ఞాసగల జీవునకుఁ గర్మంబులచేత నెయ్యది సుప్రసిద్ధం బదియు నర్థంబు గాదు;
nArAyaNa kathavalana neyyE dharmaMbulu dagulu vaDa vavi nirarthakaMbulu.
apavarga paryaMtaMbayina paradharmaMbunaku
dRshTaSruta prapaMcArthaMbu phalaMbu gAdu.
dharmaMbunaMdavyabhicAriyaina yarthaMbunaku@M gAmaMbu phalaMbu gAdu.
vishayabhOgaMbaina kAmaMbuna kiMdriya prIti phalaMbu gAdu.
eMta taDavu jIviMcu naMtiya kAmaMbunaku phalaMbu,
tattvajij~nAsagala jIvunaku@M garmaMbulacEta neyyadi suprasiddhaM badiyu narthaMbu gAdu;
కార్యపత్రం (Worksheet)
కార్యపత్రం, పద్యసహితం (Worksheet with padyam)