పోతన భాగవత పరిమళం

"ఎచ్చటఁ బుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికిన్" [7.46]

αβ'cal 163   Prev  /  Next

(తరగతి క్రమము 112)
వైకుంఠ చింతా వివర్జిత చేష్టుఁడై యొక్కఁడు నేడుచు నొక్కచోట
నశ్రాంతహరిభావనారూఢ చిత్తుఁడై యుద్ధతుఁడై పాడు నొక్కచోట
విష్ణుఁ డింతియ కాని వేఱొండు లే దని యొత్తిలి నగుచుండు నొక్కచోట
నలినాక్షుఁ డను నిధానముఁ గంటి నే నని యుబ్బి గంతులువైచు నొక్కచోటఁ

బలుకు నొక్కచోటఁ బరమేశుఁ గేశవుఁ
బ్రణయహర్షజనితబాష్పసలిల
మిళితపులకుఁడై నిమీలితనేత్రుఁడై
యొక్కచోట నిలిచి యూరకుండు
ఛందస్సు (Meter): సీసము, ఆటవెలది
స్కంధము (Chapter): 7
సంఖ్య (Number): 124
నారదుడు ప్రహ్లాదుని గుణగణములను వర్ణించుచు యుధిష్ఠిరునితో ఈ విధముగా పలికెను. ఈ పద్యము ఈ క్రింది మూడు సంస్కృత శ్లోకములకు పోతనగారు చేసిన తెలుగు అనువాదము.

क्वचिद्रुदति वैकुण्ठचिन्ताशबलचेतनः।
क्वचिद्धसति तच्चिन्ताह्लाद उद्गायति क्वचित्॥
नदति क्वचिदुत्कण्ठो विलज्जो नृत्यति क्वचित्।
क्वचित्तद्भावनायुक्तस्तन्मयोऽनुचकार ह​॥
क्वचिदुत्पुलकस्तूष्णीमास्ते संस्पर्शनिर्वृतः।
अस्पन्दप्रणयानन्द सलिलामीलितेक्षणः॥

క్వచిద్రుదతి వైకుణ్ఠచిన్తాశబలచేతనః ।
క్వచిద్ధసతి తచ్చిన్తాహ్లాద ఉద్గాయతి క్వచిత్ ॥
నదతి క్వచిదుత్కణ్ఠో విలజ్జో నృత్యతి క్వచిత్ ।
క్వచిత్తద్భావనాయుక్తస్తన్మయోऽనుచకార హ ॥
క్వచిదుత్పులకస్తూష్ణీమాస్తే సంస్పర్శనిర్వృతః ।
అస్పన్దప్రణయానన్ద సలిలామీలితేక్షణః ॥
వ్యాఖ్య
వైకుంఠ చింతా వివర్జిత చేష్టుఁడై = వైకుంఠము గురించిన ఆలోచనలోనే పడి [మిగిలన] ఆలోచనలను వదలినవాడై;
యొక్కఁడు నేడుచు నొక్కచోట = [ఏదో] ఒకచోట [కూర్చొని, ఆ ఆనందములో] ఏడుస్తూ ఉండును;
అశ్రాంతహరిభావనారూఢ చిత్తుఁడై = విశ్రాంతి లేకుండా [నిత్యమూ] భగవంతుని భావనలో గాఢమైన చిత్తముతో;
యుద్ధతుఁడై = [ఇతరములను] సహింపరాని వాడై;
పాడు నొక్కచోట = [ఏదో] ఒకచోట [కూర్చొని] పాడుకొనుచూ ఉండును;
విష్ణుఁ డింతియ కాని వేఱొండు లే దని = [ఇది అంతయు] విష్ణువేగాని ఇంకొకటి కాదు అనుచు;
యొత్తిలి నగుచుండు నొక్కచోట = బిగ్గరగా [ఒక్కొక చోట] నవ్వుచుండును;
నలినాక్షుఁ డను నిధానముఁ గంటి నే నని = తామరపూవంటి కన్నులు గలవాని [భగవంతుని] నిధిని నేను చూచితినని;
యుబ్బి గంతులువైచు నొక్కచోటఁ = [ఆనందముతో] పొంగిపోయి ఒక్కొక చోట గంతులు వేయుచు ఉండును;

పలుకు నొక్కచోటఁ = ఒక్కొక చోట ఏ విధముగా మాట్లాడేవాడంటే;
పరమేశుఁ గేశవుఁ = పరమేశ్వరుడైన కేశవుని యందు;
ప్రణయ-హర్షజనిత-బాష్ప-సలిల = ప్రేమతోను, ఆనందముతోను వచ్చిన కన్నీటితో;
మిళితపులకుఁడై = కూడి పులకించినవాడై [మాట్లాడును];
నిమీలితనేత్రుఁడై యొక్కచోట నిలిచి యూరకుండు = ఒక్కొక చోట కన్నులు మూసికొని ఏమియు చేయకుండగా [మౌనముగా] ఉండును.
సాధన
వైకుంఠ చింతా వివర్జిత చేష్టుఁడై యొక్కఁడు నేడుచు నొక్కచోట
నశ్రాంత హరిభావనా రూఢ చిత్తుఁడై యుద్ధతుఁడై పాడు నొక్కచోట
విష్ణుఁ డింతియ కాని వేఱొండు లే దని యొత్తిలి నగుచుండు నొక్కచోట
నలినాక్షుఁ డను నిధానముఁ గంటి నే నని యుబ్బి గంతులువైచు నొక్కచోటఁ

బలుకు నొక్కచోటఁ బరమేశుఁ గేశవుఁ
బ్రణయహర్షజనిత బాష్పసలిల
మిళితపులకుఁడై నిమీలితనేత్రుఁడై
యొక్కచోట నిలిచి యూరకుండు
vaikuMTha ciMtA vivarjita cEshTu@MDai yokka@MDu nEDucu nokkacOTa
naSrAMta haribhAvanA rUDha cittu@MDai yuddhatu@MDai pADu nokkacOTa
vishNu@M DiMtiya kAni vE~roMDu lE dani yottili nagucuMDu nokkacOTa
nalinAkshu@M Danu nidhAnamu@M gaMTi nE nani yubbi gaMtuluvaicu nokkacOTa@M

baluku nokkacOTa@M baramESu@M gESavu@M
braNayaharshajanita bAshpasalila
miLitapulaku@MDai nimIlitanEtru@MDai
yokkacOTa nilici yUrakuMDu
కార్యపత్రం (Worksheet)
కార్యపత్రం, పద్యసహితం (Worksheet with padyam)