పోతన భాగవత పరిమళం

"ఎచ్చటఁ బుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికిన్" [7.46]

అక్షర క్రమము 130   Prev  /  Next

(తరగతి క్రమము 43)
భాగవతము దెలిసి పలుకుట చిత్రంబు!
శూలికైనఁ దమ్మిచూలికైన!
విబుధ జనులవలన విన్నంత కన్నంత
తెలియ వచ్చినంత తేటపఱుతు.
ఛందస్సు (Meter): ఆటవెలది
స్కంధము (Chapter): 1
సంఖ్య (Number): 19
భాగవత గ్రంథ అనువాదమునకు ముందుగా దైవారాధన చేసి, తనకు ఏ విధముగా ఈ గ్రంథమును అనువాదము చేయవలెనని కోరిక కలిగెనో పోతనగారు చెప్పుకొనిరి.
వ్యాఖ్య
భాగవతము దెలిసి పలుకుట చిత్రంబు! = భాగవత గ్రంథమును పూర్తిగా అర్థముచేసికొని చెప్పుట ఆశ్చర్యము;
శూలికైనఁ = (ఆ పరమ) శివునికైన ను;
తమ్మిచూలికైన! = పద్మమునుండి పుట్టినవానికైన (అనగా బ్రహ్మకైనను);
విబుధ జనులవలన = పండితులవలన;
విన్నంత = (నేను) వినినంత;
కన్నంత = (నేను వారిదగ్గరనుండి) తెలిసికొనినంత;
తెలియ వచ్చినంత = నాకు తెలిసినంత;
తేటపఱుతు = విశదీకరించెదను (I will explain).

భాగవత గ్రంథ అనువాదమునకు ముందుగా దైవారాధన చేసి, తనకు ఏ విధముగా ఈ గ్రంథమును అనువాదము చేయవలెనని కోరిక కలిగెనో పోతనగారు చెప్పుకొనిరి. ఇది తన "పూర్వజన్మ సహస్ర సంచిత తపఃఫలమున" (1.15) కలిగిన అదృష్టమని, "సజ్జనానుమతంబున" (1.15) (పెద్దవారి అనుమతితో) ఒక చంద్రగ్రహణమునాడు గంగానది స్నానమునకు వెళ్ళి, స్నానము చేసి, "మహేశ్వర ధ్యానము" (1.15) చేయుచున్నపుడు, శ్రీ రామచంద్రుడు "కన్నుఁగవకు నెదురఁ" (1.16) కనిపించి, భాగవతమును తెలింగించిన "నీకు భవబంధములు దెగునని" (1.17) చెప్పినట్లు పోతనగారు చెప్పెను. ఆ తరువాత ఈ పై పద్యమును చెప్పెను. ఈ పద్యము మహాకవియైన పోతనగారి వినయమునకు నిదర్శనము.
సాధన
భాగవతము దెలిసి పలుకుట చిత్రంబు!
శూలికైనఁ దమ్మిచూలికైన!
విబుధ జనులవలన విన్నంత కన్నంత
తెలియ వచ్చినంత తేటపఱుతు.
bhAgavatamu delisi palukuTa citraMbu!
SUlikaina@M dammicUlikaina!
vibudha janulavalana vinnaMta kannaMta
teliya vaccinaMta tETapa~rutu.
కార్యపత్రం (Worksheet)
కార్యపత్రం, పద్యసహితం (Worksheet with padyam)