పోతన భాగవత పరిమళం

"ఎచ్చటఁ బుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికిన్" [7.46]

గ్రంథ క్రమము 28   Prev  /  Next

(తరగతి క్రమము 59)
కొందఱు సంసారమందలి మేలు కొఱకు నన్యుల సేవింతురు.
మోక్షార్థులయిన వారలు ఘోరరూపులయిన భూతపతులవిడిచి
దేవతాంతర నింద సేయక శాంతులయి
నారాయణ కథలయందుఁ బ్రవర్తింతురు.
ఛందస్సు (Meter): వచనము
స్కంధము (Chapter): 1
సంఖ్య (Number): 61
ఈ పద్యము ఈ క్రింది సంస్కృత శ్లోకమునకు పోతనగారు చేసిన తెలుగు అనువాదము:

मुमुक्षवो घोररूपान् हित्वा भूतपतीनथ ।
नारायणकलाः शान्ता भजन्ति ह्यनसूयवः ॥

ముముక్షవో ఘోరరూపాన్ హిత్వా భూతపతీనథ ।
నారాయణకలాః శాంతా భజంతి హ్యనసూయవః ॥
వ్యాఖ్య
భాగవత కథారంభములో సూతుడు ఈ విధముగా చెప్పెను:

కొందఱు = కొందఱు [జనులు];
సంసారమందలి మేలు కొఱకు - అన్యుల సేవింతురు = సంసార సుఖమును కోరి, ఇతర దేవతా రూపములను ప్రార్థింతురు;
మోక్షార్థులయిన వారలు = [కాని] ముక్తియందు కోరికగలవారు;
ఘోరరూపులయిన భూతపతులవిడిచి = భయంకరమయిన దేవతారూపములను విడిచి;
దేవతాంతర నింద సేయక = ఇతర దేవతలను నిందించక;
శాంతులయి = శాంతమయిన మనసుతో;
నారాయణ కథలయందుఁ - ప్రవర్తింతురు = నారాయణుని [అందఱు దేవతలకు, అన్ని లోకములకు ముందఱనుండి యున్నవాని] కథలయందు [భజనలతో, మననముతో] జీవింతురు;
సాధన
కొందఱు సంసారమందలి మేలు కొఱకు నన్యుల సేవింతురు.
మోక్షార్థులయిన వారలు ఘోరరూపులయిన భూతపతులవిడిచి
దేవతాంతర నింద సేయక శాంతులయి
నారాయణ కథలయందుఁ బ్రవర్తింతురు.
koMda~ru saMsAramaMdali mElu ko~raku nanyula sEviMturu.
mOkshArthulayina vAralu ghOrarUpulayina bhUtapatulaviDici
dEvatAMtara niMda sEyaka SAMtulayi
nArAyaNa kathalayaMdu@M bravartiMturu.
కార్యపత్రం (Worksheet)
కార్యపత్రం, పద్యసహితం (Worksheet with padyam)