పోతన భాగవత పరిమళం

"ఎచ్చటఁ బుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికిన్" [7.46]

గ్రంథ క్రమము 94   Prev  /  Next

(తరగతి క్రమము 140)
తన్నిమిత్తంబున విద్వాంసుండు
నామ మాత్ర సారంబులగు భోగ్యంబులలోన
నెంత దేహ నిర్వహణంబు సిద్ధించు నంతియ గైకొనుచు
నప్రమత్తుండై సంసారంబు సుఖంబని నిశ్చయింపక
యొండు మార్గంబున సిద్ధి గలదని చూచి పరిశ్రమంబు నొందకుండు.
ఛందస్సు (Meter): వచనము
స్కంధము (Chapter): 2
సంఖ్య (Number): 20
శుకుడు పరీక్షిత్తునకు ముక్తి మార్గమును తెలిపి, మూఢముగా వేదమార్గముతో కర్మఫలసాధనకు యత్నించరాదని చెప్పి ఈ విధముగా పలికెను. ఈ వచనము ఈ క్రింది సంస్కృత శ్లోకమునకు పోతనగారు చేసిన తెలుగు అనువాదము.

अतः कविर्नामसु यावदर्थः स्यादप्रमत्तो व्यवसायबुद्धिः।
सिद्धेऽन्यथार्थे न यतेत तत्र परिश्रमं तत्र समीक्शमाणः॥

అతః కవిర్నామసు యావదర్థః స్యాదప్రమత్తో వ్యవసాయబుద్ధిః।
సిద్ధేऽన్యథార్థే న యతేత తత్ర పరిశ్రమం తత్ర సమీక్షమాణః॥
వ్యాఖ్య
తన్నిమిత్తంబున విద్వాంసుండు = తెలిసినవాడు, తన దేహము యొక్క ఉనికిని గమనించి;
నామ మాత్ర సారంబులగు భోగ్యంబులలోన = నామ మాత్రమే సారముగా గల భోగములలో;
నెంత దేహ నిర్వహణంబు సిద్ధించు = ఎంత వరకు తన దేహ నిర్వహణమునకు ఉపయోగమో;
నంతియ గైకొనుచు = అంత మాత్రమే గ్రహించుచు;
నప్రమత్తుండై = మత్తులో పడిపోకుండ;
సంసారంబు సుఖంబని నిశ్చయింపక = ఈ సంసారమున సుఖము లేదని తెలిసికొని;
యొండు మార్గంబున సిద్ధి గలదని చూచి = వేరొక మార్గమున సిద్ధి లభించునని గ్రహించి;
పరిశ్రమంబు నొందకుండు = (వ్యర్థములైన వాని కొఱకు) శ్రమించకుండా యుండును.
సాధన
తన్నిమిత్తంబున విద్వాంసుండు
నామ మాత్ర సారంబులగు భోగ్యంబులలోన
నెంత దేహ నిర్వహణంబు సిద్ధించు నంతియ గైకొనుచు
నప్రమత్తుండై సంసారంబు సుఖంబని నిశ్చయింపక
యొండు మార్గంబున సిద్ధి గలదని చూచి పరిశ్రమంబు నొందకుండు.
tannimittaMbuna vidvAMsuDu
nAma mAtra sAraMbulagu bhOgyaMbulalOna
neMta dEha nirvahaNaMbu siddhiMcu naMtiya gaikonucu
napramattuMDai saMsAraMbu sukhaMbani niScayiMpaka
yoMDu mArgaMbuna siddhi galadani cUci pariSramaMbu noMdakuMDu.
కార్యపత్రం (Worksheet)
కార్యపత్రం, పద్యసహితం (Worksheet with padyam)