పోతన భాగవత పరిమళం

"ఎచ్చటఁ బుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికిన్" [7.46]

αβ'cal 170   Prev  /  Next

(తరగతి క్రమము 23)
విను మీ సంసారం బను
వననిధిలో మునిఁగి కర్మవాంఛలచే వే
దనఁ బొందెడు వానికి వి
ష్ణుని గుణవర్ణనము తెప్ప సుమ్ము మునీంద్రా!
ఛందస్సు (Meter): కందము
స్కంధము (Chapter): 1
సంఖ్య (Number): 131
ఈ పద్యము ఈ క్రింది శ్లోకానికి పోతనగారు చేసిన అనువాదము.

एएतद्ध्यातुरचित्तानां मात्रास्पर्शेच्छया मुहुः।
भवसिन्धुप्लवो दृष्टो हरिचर्यानुवर्णनम्॥

ఏతత్ద్ధ్యాతురచిత్తానాం మాత్రాస్పర్శేచ్ఛయా ముహుః।
భవసింధుప్లవో దృష్టో హరిచర్యానువర్ణనం॥
వ్యాఖ్య
వినుము = ఓ వ్యాసమునీంద్రా! వినుము;
ఈ సంసారం బను = ఈ సంసారము అను;
వననిధిలో మునిఁగి = నీటి పాతఱ (అనగా సముద్రము) లో మునిగి;
కర్మవాంఛలచే = (ప్రతిఫలము ఆధారముగా గల) కర్మ కోరికల (బంధాల) వలన;
వేదనఁ బొందెడు వానికి = బాధలను అనుభవించు వానికి;
విష్ణుని గుణవర్ణనము = విష్ణువు యొక్క స్వభావములను వర్ణించుట (లేదా పాడుట);
తెప్ప సుమ్ము = నిశ్చయముగా (ఒడ్డుకు చేర్చు) తెప్ప వంటిది;
మునీంద్రా = మునులలో అగ్రగణ్యుడా.

నారదుడు తన పూర్వ జన్మ వృత్తాంతమును వ్యాసునితో చెప్పెను. పూర్వజన్మ అనంతరము ఒక వేయి యుగముల (అనగా 1000 X 4,320,000 = 4,320,000,000 సంవత్సరముల) తరువాత మరీచి, అంగీర, అత్రి మొదలైన మునులతో పాటు తను కుడా బ్రహ్మ యొక్క నిశ్వాసము ద్వారా జన్మించెను. అప్పుడు ఆయన అఖండ బ్రహ్మచర్యముతో మూడు లోకాలయందు, నారాయణుని కథాగానమును చేయుచు తిరుగుచు యుండునని వివరించెను. తాను గానం చేసినప్పుడల్లా పిలిచినట్లు వచ్చి తన మనస్సులో విష్ణువు కానవచ్చునని చెప్పి, ఇంకా ఈ పద్యములో చెప్పినట్లుగా చెప్పెను.
సాధన
విను మీ సంసారం బను
వననిధిలో మునిఁగి కర్మవాంఛలచే వే
దనఁ బొందెడు వానికి
వి
ష్ణుని గుణవర్ణనము
తెప్ప సుమ్ము మునీంద్రా!
vinu mI saMsAraM banu
vananidhilO muni@Mgi karmavAMCalacE vE
dana@M boMdeDu vAniki
vi
shNuni guNavarNanamu
teppa summu munIMdrA!
కార్యపత్రం (Worksheet)
కార్యపత్రం, పద్యసహితం (Worksheet with padyam)