పోతన భాగవత పరిమళం

"ఎచ్చటఁ బుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికిన్" [7.46]

αβ'cal 173   Prev  /  Next

(తరగతి క్రమము 73)
విశ్వజన్మస్థితి విలయంబు లెవ్వనివలన నేర్పడు ననువర్తనమున
వ్యావర్తనమునఁ గార్యములం దభిజ్ఞుడై తాన రాజగుచుఁ జిత్తమునఁ జేసి
వేదంబు లజునకు విదితముల్ గావించె నెవ్వఁడు బుధులు మోహింతు రెవ్వనికి
నెండమావులనీళ్ళఁ గాచాదులు నన్యోన్యబుద్ధి దా నడరు నట్లు

త్రిగుణ సృష్టి యెందు దీపించి సత్యము
భంగిఁ దోఁచు స్వప్రభానిరస్త
కుహకుఁడెవ్వఁ డతనిఁ గోరి చింతించెద
ననఘు సత్యుఁ బరుని ననుదినంబు.
ఛందస్సు (Meter): సీసము, ఆటవెలది
స్కంధము (Chapter): 1
సంఖ్య (Number): 34
ఈ పద్యము, ఈ క్రింది, భాగవతములోని మొట్టమొదటి సంస్కృత శ్లోకమునకు పోతనగారు చేసిన తెలుగు అనువాదము.

जन्माद्यस्य यतोऽन्वयादितरतश्चार्थेष्वभिज्ञः स्वराट्
तेने ब्रह्म हृदा य आदिकवये मुह्यन्ति यत्सूरयः ।
तेजोवारिम​ृदां यथा विनिमयो यत्र त्रिसर्गोऽम​ृषा
धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि ॥

జన్మాద్యస్య యతో న్వయాదితరతశ్చార్థేష్వభిజ్ఞః స్వరాట్
తేనే బ్రహ్మ హృదాయ ఆదికవయే ముహ్యంతి యత్సూరయః ।
తేనే వారిమృదాం యథా వినిమయో యత్ర త్రిసర్గో మృషా
ధామ్నా స్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి॥
వ్యాఖ్య
విశ్వజన్మస్థితి విలయంబుల్ = [ఈ] విశ్వము యొక్క జన్మము, స్థితి, నాశనము [విలయము] లు;
ఎవ్వనివలన నేర్పడు = ఎవని వలన ఏర్పడునో;
అనువర్తనమున వ్యావర్తనమునఁ = అనువర్తనమున, వ్యావర్తనమున;
కార్యములం దభిజ్ఞుడై = కార్యనిర్వహణలో సమర్థుడయి;
తాన రాజగుచుఁ = తనే శాశించువాడగుచు;
చిత్తమునఁ జేసి = [సకల] చిత్తములలో ఉన్నవాడై;
వేదంబు లజునకు విదితముల్ గావించె నెవ్వఁడు = వేదములను [మొదట] భ్రహ్మకు బోధించినవాడు ఎవడో;
బుధులు మోహింతు రెవ్వనికి = యోగులు [సైతము] ఎవని మాయలో ఉండెదరో;
ఎండమావులనీళ్ళఁ గాచాదులు నన్యోన్యబుద్ధి = [ఏ విధముగా] ఎండమావులలో, నీళ్ళలో, గాజు పదార్థములలో [కనిపించునవి ఎంత అసత్యమో - కాని];
తా నడరు నట్లు = తాను అంతటా వ్యాపించి;

త్రిగుణ సృష్టి యెందు దీపించి సత్యము భంగిఁ దోఁచు = త్రిగుణములతో గూడిన ఈ సృష్టి నిజమని తోచునట్లు చేయునో;
స్వప్రభా = స్వయంగా ప్రకాశిస్తూ;
నిరస్త కుగకుఁడెవ్వఁడు = మాయను తొలగించునది ఎవరో;
అతనిఁ గోరి చింతించెద = అట్టివానిని కోరి [నేను] చించించెదను;
అనఘు = [ఆయన] నిర్మలమైనట్టి వాడు;
సత్యుఁ = సత్యస్వరూపుడు;
పరుని = పరమమైనట్టివాని [absolute];
అనుదినంబు = ప్రతినిత్యము.
సాధన
విశ్వజన్మస్థితి విలయంబు లెవ్వనివలన నేర్పడు ననువర్తనమున
వ్యావర్తనమునఁ గార్యములం దభిజ్ఞుడై
తాన రాజగుచుఁ జిత్తమునఁ జేసి
వేదంబు లజునకు విదితముల్ గావించె నెవ్వఁడు బుధులు మోహింతు రెవ్వనికి
నెండమావులనీళ్ళఁ గాచాదులు నన్యోన్యబుద్ధి దా నడరు నట్లు

త్రిగుణ సృష్టి యెందు దీపించి సత్యము
భంగిఁ దోఁచు
స్వప్రభానిరస్త
కుహకుఁడెవ్వఁ
డతనిఁ గోరి చింతించెద
ననఘు
సత్యుఁ బరుని ననుదినంబు.
viSvajanmasthiti vilayaMbu levvanivalana nErpaDu nanuvartanamuna
vyAvartanamuna@M gAryamulaM dabhij~nuDai
tAna rAjagucu@M jittamuna@M jEsi
vEdaMbu lajunaku viditamul gAviMce nevva@MDu budhulu mOhiMtu revvaniki
neMDamAvulanILLa@M gAcAdulu nanyOnyabuddhi dA naDaru naTlu

triguNa sRshTi yeMdu dIpiMci satyamu
bhaMgi@M dO@Mcu
svaprabhAnirasta
kuhaku@MDevva@M
Datani@M gOri ciMtiMceda
nanaghu
satyu@M baruni nanudinaMbu.
కార్యపత్రం (Worksheet)
కార్యపత్రం, పద్యసహితం (Worksheet with padyam)