పోతన భాగవత పరిమళం

"ఎచ్చటఁ బుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికిన్" [7.46]

తరగతి క్రమము 51   Prev  /  Next

నిర్విఘ్నయు, నిర్హేతుకయునై హరిభక్తి
యేరూపంబునం గలుగు నది పురుషులకుఁ బరధర్మంబగు,
వాసుదేవునియందు బ్రయోగింపంబడిన
భక్తియోగంబు వైరాగ్య విజ్ఞానంబులం బుట్టించు.
ఛందస్సు (Meter): వచనము
స్కంధము (Chapter): 1
సంఖ్య (Number): 58
ఈ వచన భాగము ఈ క్రింది రెండు సంస్కృత శ్లోకములకు పోతనగారు చేసిన తెలుగు అనువాదము:

स वै पुंसां परो धर्मो यतो भक्तिरधोक्षजे ।
अहैतुक्यप्रतिहता ययाऽऽत्मा सुप्रसीदति ॥
वासुदेवे भगवति भक्तियोगः प्रयोजितः।
जनयत्याशु वैराग्यं ज्ञानं च यदहैतुकम्॥

స వై పుంసాం పరో ధర్మో యతో భక్తిరధోక్షజే ।
అహైతుక్యప్రతిహతా యయాऽऽత్మా సుప్రసీదతి ॥
వాసుదేవే భగవతి భక్తియోగః ప్రయోజితః ।
జనయత్యాశు వైరాగ్యం జ్ఞానం చ యదహైతుకం ॥
వ్యాఖ్య
ఏవిధయైన మార్గము మానవులకు శాంతిని ప్రసాదించునో తెలియజేయమని శౌనకాది ఋషులు ఆడుగగా, సూతుడు భాగవత కథా ప్రారంభములో ఈ విధముగా చెప్పనారంభించెను:

నిర్విఘ్నయు = విరామము లేని (uninterrupted);
నిర్హేతుకయునై = కారణములేని (ఎటువంటి కోరికలు లేని);
హరిభక్తి = భగవంతునియందు భక్తి;
యేరూపంబునం గలుగు = దేనివలన కలుగునో;
అది పురుషులకుఁ బరధర్మంబగు = ఆ మార్గము మానవులకు పరమ (అంతిమ, లేదా ప్రధానమయిన) ధర్మమగును;
వాసుదేవునియందు = వాసుదేవునియందు;
ప్రయోగింపంబడిన = సమర్పింపబడిన;
భక్తియోగంబు = భక్తియోగము;
వైరాగ్య = వైరాగ్యము (freedom from all desires);
విజ్ఞానంబులం బుట్టించు = విజ్ఞానమును (knowledge/wisdom) కలిగించును.
సాధన
నిర్విఘ్నయు, నిర్హేతుకయునై హరిభక్తి
యేరూపంబునం గలుగు నది పురుషులకుఁ బరధర్మంబగు,
వాసుదేవునియందు బ్రయోగింపంబడిన
భక్తియోగంబు
వైరాగ్య విజ్ఞానంబులం బుట్టించు.
nirvighnayu, nirhEtukayunai haribhakti
yErUpaMbunaM galugu nadi purushulaku@M baradharmaMbagu,
vAsudEvuniyaMdu brayOgiMpabaDina
bhaktiyOgaMbu
vairAgya vij~nAnaMbulaM buTTiMcu.
కార్యపత్రం (Worksheet)
కార్యపత్రం, పద్యసహితం (Worksheet with padyam)