పోతన భాగవత పరిమళం

"ఎచ్చటఁ బుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికిన్" [7.46]

అక్షర క్రమము 70   Prev  /  Next

(తరగతి క్రమము 10)
జననము లేక కర్మముల జాడలఁ బోక సమస్తచిత్త వ
ర్తనుఁ డగు చక్రికిం గవులుదార పదంబుల జన్మ కర్మముల్
వినుతులు సేయుచుండుదురు వేద రహస్యములందు నెందుఁ జూ
చిన మఱి లేవు జీవునికిఁ జెప్పిన కైవడి జన్మకర్మముల్.
ఛందస్సు (Meter): చంపకమాల
స్కంధము (Chapter): 1
సంఖ్య (Number): 68
ఈ పద్యము ఈ క్రింది మూల శ్లోకమునకు అనువాదము:

एवं जन्मानि कर्माणि ह्यकर्तुरजनस्य च ।
वर्णयन्ति स्म कवयो वेदगुह्यानि हृत्पाते: ॥

ఏవం జన్మాని కర్మాణి హ్యకర్త్రురజనస్య చ ।
వర్ణయంతి స్మ కవయో వేదగుహ్యాని హృత్పతేః ॥
వ్యాఖ్య
జననము లేక కర్మముల జాడలఁ బోక = పుట్టుకలు గాని, కర్మబంధములు గాని లేక;
సమస్తచిత్త వర్తనుడగు చక్రికిం = అందరి హృదయములలో నివసించు విష్ణువు కు;
కవులు = (భాషా నైపుణ్యము, పాండిత్యము - enlightened - వివేకము కలిగిన) కవులు;
ఉదార పదంబుల = ఉదార పదములతో (generous words);
వినుతులు సేయుచుండుదురు = పొగడెదరు;
వేద రహస్యములందు = [కానీ] దాగియున్న వేదార్ధములను;
ఎందుఁ జూచిన = ఎక్కడ వెదకి చూచినప్పటికిని;
మఱి లేవు జీవునికి చెప్పిన కైవడి జన్మ కర్మముల్ = జీవునికి కలిగినటువంటి జన్మములు, కర్మములు (ఆ భగవంతునికి) లేనే లేవు.

58 నుంచి 67 పద్యాలలో భక్తి యోగము వలన వైరాగ్య విజ్ఞానములు కలుగునని, తత్వ వేత్తలు పొందు అద్వయజ్ఞానాన్ని ఉపనిషత్తులు చదివినవారు "బ్రహ్మము" అని, భక్తులు "పరమాత్మ" అని, సాత్వికులు "భగవంతుడు" అని అంటారని చెప్పియున్నది. అంతే కాక నిజముగా జీవుడు కనిపించని సూక్ష్మ రూపమని, కనిపించే స్థూల రూపము కేవలము మాయాగుణాలవలన కలిగినదని, స్వస్వరూప జ్ఞానమువలన ఈ రూపాలన్ని తొలగి పోయి, జీవుడు బ్రహ్మస్వరూపమునొంది పరమానందమునొందునని చెప్పిన తదుపరి, సూతుడు ఆ పరమాత్మ గురించి ఈ పద్యములో చెప్పిన విధముగా చెప్పెను.
సాధన
జననము లేక కర్మముల జాడలఁ బోక సమస్తచిత్త వ
ర్తనుఁ డగు చక్రికిం
గవులుదార పదంబుల జన్మ కర్మముల్
వినుతులు సేయుచుండుదురు వేద రహస్యములందు నెందుఁ జూ
చిన మఱి లేవు
జీవునికిఁ జెప్పిన కైవడి జన్మకర్మముల్.
jananamu lEka karmamula jADala@M bOka samastacitta va
rtanu@M Dagu cakrikiM
gavuludAra padaMbula janma karmamul
vinutulu sEyucuMDuduru vEda rahasyamulaMdu neMdu@M jU
cina ma~ri lEvu
jIvuniki@M jeppina kaivaDi janmakarmamul.
కార్యపత్రం (Worksheet)
కార్యపత్రం, పద్యసహితం (Worksheet with padyam)