పోతన భాగవత పరిమళం

"ఎచ్చటఁ బుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికిన్" [7.46]

గ్రంథ క్రమము 30   Prev  /  Next

(తరగతి క్రమము 62)
మాహదహంకార తన్మాత్ర సంయుక్తుడై చారు షోడశ కళాసహితుఁడగుచుఁ
బంచ మహాభూత భాసితుండై శుద్ధ సత్వుఁడై సర్వాతిశాయి యగుచుఁ
జరణోరు భుజ ముఖ శ్రవణాక్షి నాసా శిరములు నానా సహస్రములు వెలుఁగ
నంబర కేయూర హార కుండల కిరీటాదులు పెక్కువే లమరుచుండఁ

బురుష రూపంబు ధరియించి పరుఁ డనంతుఁ
డఖిల భువనైక వర్తన యత్న మమర
మానితోదార జలరాశి మధ్యమునను
యోగనిద్రా విలసియై యొప్పుచుండు.
ఛందస్సు (Meter): సీసము, తేటగీతి
స్కంధము (Chapter): 1
సంఖ్య (Number): 62
ఈ పద్యము ఈ క్రింది రెండు సంస్కృత శ్లోకములలోని మొదటి మూడు పాదములకు పోతనగారు చేసిన తెలుగు అనువాదము:

जगृहे पौरुषं रूपं भगवान्महदादिभिः ।
सम्बूतं षोडशकलमादौ लोकसिसृक्षया ॥
यस्यांभसि शयानस्य योगनिद्रां वितंतवः ।
नाभिहृदाम्बुजादासीद्ब्र्ह्मा विश्वसृजां पतिः ॥

జగృహే పౌరుషం రూపం భగవాన్మహదాదిభిః ।
సంభూతం షోడశకలమాదౌ లోకసిసృక్షయా ॥
యస్యాంభసి శయానస్య యోగనిద్రాం వితంతవః ।
నాభిహృదాంబుజాదాసీద్బ్రహ్మా విశ్వసృజాం పతిః ॥
వ్యాఖ్య
[సూతుడు శౌనకాది మునులతో భాగవత కథారంభములో ఈ విధముగా చెప్పెను.]
సాధన
మాహదహంకార తన్మాత్ర సంయుక్తుడై చారు షోడశ కళాసహితుఁడగుచుఁ
బంచ మహాభూత భాసితుండై శుద్ధ సత్వుఁడై సర్వాతిశాయి యగుచుఁ
జరణోరు భుజ ముఖ శ్రవణాక్షి నాసా శిరములు నానా సహస్రములు వెలుఁగ
నంబర కేయూర హార కుండల కిరీటాదులు పెక్కువే లమరుచుండఁ

బురుష రూపంబు ధరియించి పరుఁ డనంతుఁ
డఖిల భువనైక వర్తన యత్న మమర
మానితోదార జలరాశి మధ్యమునను
యోగనిద్రా విలసియై యొప్పుచుండు.
mahadahaMkAra tanmAtra saMyuktuDai cAru shODaSa kaLAsahitu@MDagucu@M
baMca mahAbhUta bhAsituMDai Suddha satvu@MDai sarvAtiSAyi yagucu@M
jaraNOru bhuja mukha SravaNAkshi nAsA Siramulu nAnA sahasramulu velu@Mga
naMbara kEyUra hAra kuMDala kirITAdulu pekkuvE lamarucuMDa@M

burusha rUpaMbu dhariyiMci paru@M DanaMtu@M
Dakhila bhuvalaika vartana yatna mamara
mAnitOdAra jalarASi madhyamunanu
yOganidrA vilasiyai yoppucuMDu.
కార్యపత్రం (Worksheet)
కార్యపత్రం, పద్యసహితం (Worksheet with padyam)