పోతన భాగవత పరిమళం

"ఎచ్చటఁ బుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికిన్" [7.46]

తరగతి క్రమము 70   Prev  /  Next

ఈ స్థూల రూపంబుకంటె
నదృష్ట గుణంబయి యశ్రుతంబైన వస్తువగుటంజేసి
వ్యక్తంబుగాక సూక్ష్మంబై కరచరణాదులు లేక జీవునికి
నొండొకరూపంబు విరచితంబై యుండు.
సూక్ష్ముఁ డయిన జీవునివలన
నుత్క్రాంతి గమనాగమనంబులం బునర్జన్మంబు దోఁచు.
ఛందస్సు (Meter): వచనము
స్కంధము (Chapter): 1
సంఖ్య (Number): 67
ఈ వచనము ఈ క్రింది సంస్కృత శ్లోకమునకు పోతనగారు చేసిన తెలుగు అనువాదము (కొన్ని ప్రతులలోగల భేదము సూచించబడినది)

अतः परं यदव्यक्तमव्यूढगुणव्यूहितं [गुणबृंहितम्]।
अदृष्टाशुत वस्तुत्वात्सजीवो यत्पुनर्भवः॥

అతః పరం యదవ్యక్తమవ్యూఢగుణవ్యూహితమ్ [గుణబృంహితమ్]।
అదృష్టాశ్రుత వస్తుత్వాత్సజీవో యత్పునర్భవః ॥
వ్యాఖ్య
ఈ స్థూల రూపంబుకంటె = ఈ స్తూల రూపముకంటె;
అదృష్ట గుణంబయి = కనులకు కనిపించని;
అశ్రుతంబైన వస్తువగుటంజేసి = చెవులకు వినిపించని పదార్థమై;
వ్యక్తంబుగాక = రూపము ధరించని;
సూక్ష్మంబై = చిన్నదిగా ఉండి;
కరచరణాదులు లేక = చేతులు, కాళ్ళు లేకుండగ;
జీవునికి = జీవునికి;
ఒండొకరూపంబు విరచితంబై యుండు = ఇంకొక రూపము వ్యక్తమై ఉండును;
సూక్ష్ముఁ డయిన జీవునివలన = ఇట్టి సూక్ష్మమయిన జీవుని వలన;
ఉత్క్రాంతి గమన - ఆగమనంబులం = మీదికి పోవుట, వచ్చుట వలన;
పునర్జన్మంబు దోఁచు = పునర్జన్మము ఉదయించును.
సాధన
ఈ స్థూల రూపంబుకంటె
నదృష్ట గుణంబయి యశ్రుతంబైన వస్తువగుటంజేసి
వ్యక్తంబుగాక సూక్ష్మంబై కరచరణాదులు లేక జీవునికి
నొండొకరూపంబు విరచితంబై యుండు.
సూక్ష్ముఁ డయిన జీవునివలన
నుత్క్రాంతి గమనాగమనంబులం బునర్జన్మంబు దోఁచు.
I sthUla rUpaMbukaMTe
nadRshTa guNaMbayi yaSrutaMbaina vastuvaguTaMjEsi
vyaktaMbugAka sUkshmaMbai karacaraNAdulu lEka jIvuniki
noMDokarUpaMbu viracitaMbai yuMDu.
sUkshmu@M Dayina jIvunivalana
nutkrAMti gamanAgamanaMbulaM bunarjanmaMbu dO@Mcu.
కార్యపత్రం (Worksheet)
కార్యపత్రం, పద్యసహితం (Worksheet with padyam)