పోతన భాగవత పరిమళం

"ఎచ్చటఁ బుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికిన్" [7.46]

అక్షర క్రమము 20   Prev  /  Next

(తరగతి క్రమము 90)
ఆత్మాశ్రయమైన బుద్ధి యాత్మయందున్న
యానందాదులతోడంగూడని తెఱంగున
నీశ్వరుండు ప్రకృతితోడం గూడియు
నా ప్రకృతి గుణంబులైన సుఖదుఃఖంబులఁ జెందకయుండుఁ.
ఛందస్సు (Meter): వచనము
స్కంధము (Chapter): 1
సంఖ్య (Number): 272
ఈ వచనము ఈ క్రింది సంస్కృత శ్లోకమునకు పోతనగారు చేసిన తెలుగు అనువాదము:

एतदीशनमीशस्य प्रकृतिस्थोऽपि तद्गुणै: ।
न युज्यते सदाऽऽत्मस्थैर्यथा बुद्धिस्तदाश्रया ॥

ఏతదీశనమీశస్య ప్రకృతిస్థోపి తద్గుణైః ।
నయుజ్యతే సదాత్మస్థైర్యథా బుద్ధిస్తదాశ్రయా ॥
వ్యాఖ్య
శ్రీకృష్ణుడు హస్తినాపురమునుండి ద్వారకానగరమునకేగిన పిమ్మట, అంతఃపురకాంతల జూచుటకు వెడలిన సందర్భములో సూతుడు ఈ విధముగా వర్ణించెను. "సంగరహితుండయిన" కృష్ణుడు "సంసారి" వలె విహరించుచుండగా "అజ్ఞాన విలోకులయిన లోకులు లోకసామాన్య మనుష్యుండని" తలచెదరని చెప్పి ఈ శ్లోకములో చెప్పిన విధముగా చెప్పెను.
సాధన
ఆత్మాశ్రయమైన బుద్ధి యాత్మయందున్న
యానందాదులతోడం గూడని తెఱంగున
నీశ్వరుండు ప్రకృతితోడం గూడియు
నా ప్రకృతి గుణంబులైన సుఖదుఃఖంబులఁ జెందకయుండుఁ.
AtmASrayamaina buddhi yAtmayaMdunna
yAnaMdAdulatODaM gUDani te~raMguna
nISvaruMDu prakRtitODaM gUDiyu
nA prakRti guNaMbulaina sukhadu@HkhaMbula@M jeMdakayuMDu@M.
కార్యపత్రం (Worksheet)
కార్యపత్రం, పద్యసహితం (Worksheet with padyam)