పోతన భాగవత పరిమళం

"ఎచ్చటఁ బుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికిన్" [7.46]

అక్షర క్రమము 139   Prev  /  Next

(తరగతి క్రమము 19)
యమ నియమాది యోగముల నాత్మ నియంత్రిత మయ్యుఁ గామరో
షముల బ్రచోదితంబ యగు శాంతి వహింపదు విష్ణు సేవచేఁ
గ్రమమున శాంతిఁ గైకొనిన కైవడి నాదు శరీర జన్మ క
ర్మముల రహస్య మెల్ల మునిమండన, చెప్పితి నీవు గోరినన్.
ఛందస్సు (Meter): చంపకమాల
స్కంధము (Chapter): 1
సంఖ్య (Number): 132
ఈ పద్యము ఈ క్రింది శ్లోకమునకు పోతనగారి అనువాదము:

यमादिभिर्योगपथैः कामलोभहतो मुहुः ।
मुकुन्दसेवया यद्वत्तथाऽऽत्माद्धा न शाम्यति ॥

యమాదిభిర్యోగపథైః కామలోభహతో ముహుః ।
ముకుందసేవయా యద్వత్తథాऽऽత్మాత్థా న శామ్యతి ॥
వ్యాఖ్య
యమ నియమాది యోగముల = యమము, నియమము మొదలైన యోగముల ద్వారా ;
ఆత్మ నియంత్రిత మయ్యు = మనస్సు ను ఎంత అణచి వేసినప్పటికిని;
కామ రోషముల బ్రచోతింబ యగు = కామము, కోపముల ద్వారా (సులభముగ) ప్రేరేపింపబడును;
శాంతి వహింపదు = (మనసు) శాంతించదు (కానీ);
విష్ను సేవచేఁ గ్రమమున శాంతిఁ గైకొనిన కైవడి = (ఆ పరమాత్మయైన) విష్నుదేవుని సేవ వల్లనే క్రమముగా శాంతి పొందిన ప్రకారము ను;
నాదు శరీర జన్మ కర్మముల రహస్య మెల్ల = నా యొక్క శరీర జన్మ, కర్మముల రహస్యమంత;
మునిమండ చెప్పితి నీవు గోరినన్ = ఓ మునులలో అగ్రగణ్యుడా! నీవు అడుగగా చెప్పితిని.

అష్టాంగ యోగములు అని పిలువబడు ఎనిమిది యోగములు గలవు. ఇందు 5 బహిరంగములు - ఇవి పూర్వాపేక్షితములు అనగా prerequisites: (1) యమ - ఇందులో మరల ఐదు భాగములు గలవు - అహింస, సత్య, అస్తేయ, బ్రహ్మచర్య, అపరిగ్రహ, (2) నియమ - ఇందులో మరల ఐదు భాగములు గలవు - శౌచ, సంతోష, తపస్, స్వాధ్యాయ, ఈశ్వర ప్రణిధాన, (3) ఆసన, (4) ప్రాణాయామ, మఱియు (5) ప్రత్యాహార (అనగా ఇంద్రియములను మరలించుట). అంతరంగములని మూడు యోగాంగములు గలవు: (6) ధారణ (concentration), (7) ధ్యాన (meditation), మఱియు (8) సమాధి (absorbed concentration).

ఇట్టి యోగాంగముల ద్వారా మనస్సును ఎంత అదుపులో యుంచినప్పటికి, సమయ సందర్భములను బట్టి కామ క్రోధములు మానవునిలో ప్రేరేపింపబడును. కావున భగవంతుని భక్తితో సేవచేసిన క్రమముగ మనసుకు శాంతి కలుగునని నారదుని మాటలకు అర్ధము.
సాధన
యమ నియమాది యోగముల నాత్మ నియంత్రిత మయ్యుఁ గామరో
షముల బ్రచోదితంబ యగు
శాంతి వహింపదు విష్ణు సేవచేఁ
గ్రమమున
శాంతిఁ గైకొనిన కైవడి నాదు శరీర జన్మ క
ర్మముల
రహస్య మెల్ల మునిమండన, చెప్పితి నీవు గోరినన్.
yama niyamAdi yOgamula nAtma niyaMtrita mayyu@M gAmarO
shamula bracOditaMba yagu
SAMti vahiMpadu vishNu sEvacE@M
gramamuna
SAMti@M gaikonina kaivaDi nAdu SarIra janma ka
rmamula
rahasya mella munimaMDana, ceppiti nIvu gOrinan.
కార్యపత్రం (Worksheet)
కార్యపత్రం, పద్యసహితం (Worksheet with padyam)