పోతన భాగవత పరిమళం

"ఎచ్చటఁ బుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికిన్" [7.46]

గ్రంథ క్రమము 23   Prev  /  Next

(తరగతి క్రమము 54)
భక్తి గలుగ రజస్తమోగుణ ప్రభూతంబులైన
కామలోభాదులకు వశంబుగాక చిత్తంబు సత్త్వగుణంబునఁ బ్రసన్నంబగుఁ;
బ్రసన్న మనస్కుండైన ముక్త సంగుండగు;
ముక్త సంగుండైన నీశ్వర తత్త్వజ్ఞానంబు సిద్ధించు;
ఛందస్సు (Meter): వచనము
స్కంధము (Chapter): 1
సంఖ్య (Number): 58
ఈ వచన భాగము ఈ క్రింది రెండు సంస్కృత శ్లోకములకు పోతనగారు చేసిన అనువాదము:

तदा रजस्तमोभावाः कामलोभादयश्च ये ।
चेत एतैरनाविद्धं स्थितं सत्वे प्रसीदति ॥
एवं प्रसन्नमनसो भगवद्भक्तियोगतः ।
भगवत्तत्त्वविज्ञानं मुक्तसझ्गस्य जायते ॥

తదా రజస్తమోభావాః కామలోభాయదశ్చ యే।
చేత ఏతైరనావిద్ధం స్థితం సత్వే ప్రసీదతి ॥
ఏవం ప్రసన్నమనసో భగవద్భక్తియోగతః ।
భగవత్తత్త్వవిజ్ఞానం ముక్తసఙ్గస్య జాయతే ॥
వ్యాఖ్య
[భాగవత కథారంభములో శౌనకాది మునులు అడిగిన ప్రశ్నకు సమాధానముగా సూతుడు ఈ విధముగా చెప్పనారంభించెను:] భక్తి గలుగ = భక్తి కలిగినయెడల;

రజస్తమోగుణ ప్రభూతంబులైన కామలోభాదులకు వశంబుగాక = రజోగుణము, తమోగుణములను అధికము చేయు కామము మఱియు లోభములకు వశమై పోకుండగ;
చిత్తంబు = మనసు;
సత్త్వగుణంబునఁ బ్రసన్నంబగుఁ = సాత్విక గుణముతో నిర్మలత్వమును పొందును (శుద్ధి చెందును);
ప్రసన్న మనస్కుండైన = (ఆ విధముగ) శుద్ధి చెందిన మనసుగలిగినప్పుడు;
ముక్త సంగుండగు = ముక్తి పొందుటకు స్థిరమై యుండును;
ముక్త సంగుండైన నీశ్వర తత్త్వజ్ఞానంబు సిద్ధించు = (ఆ విధముగ) ముక్తి పొందుటకు స్థిరమైనప్పుడు భగవంతుని తత్త్వజ్ఞానము కలుగును;
సాధన
భక్తి గలుగ రజస్తమోగుణ ప్రభూతంబులైన
కామలోభాదులకు వశంబుగాక చిత్తంబు సత్త్వగుణంబునఁ బ్రసన్నంబగుఁ;
బ్రసన్న మనస్కుండైన ముక్త సంగుండగు;
ముక్త సంగుండైన నీశ్వర తత్త్వజ్ఞానంబు సిద్ధించు;
bhakti galuga rajastamOguNa prabhUtaMbulaina
kAmalObhAdulaku vaSaMbugAka cittaMbu sattvaguNaMbuna@M brasannaMbagu@M;
brasanna manaskuMDaina mukta saMguMDagu;
mukta saMguMDaina nISvara tattvaj~nAnaMbu siddhiMcu;
కార్యపత్రం (Worksheet)
కార్యపత్రం, పద్యసహితం (Worksheet with padyam)