పోతన భాగవత పరిమళం

"ఎచ్చటఁ బుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికిన్" [7.46]

αβ'cal 111   Prev  /  Next

(తరగతి క్రమము 84)
నీ పాదాబ్జము బ్రహ్మపూజ్యము గదా, నీ సేవ సంసార సం
తాపధ్వంసినియౌఁ గదా, సకలభద్రశ్రేణులం బ్రీతితో
నాపాదింతుఁ గదా, ప్రపన్నులకుఁ గాలాధీశ! కాలంబు ని
ర్వ్యాపారంబు గదయ్య చాలరు నినున్ వర్ణింప బ్రహ్మాదులున్.
ఛందస్సు (Meter): శార్దూలము
స్కంధము (Chapter): 1
సంఖ్య (Number): 249
ఈ పద్యము ఈ క్రింది సంస్కృత శ్లోకమునకు పోతనగారు చేసిన తెలుగు అనువాదము:

नताः स्म ते नाथ सदाङ्घ्रिपंकजं विरिञ्चिवैरिञ्च्यसुरेन्द्रवन्दितम् ।
परायणं क्षेममिहेच्छतां परं न यत्र कालः प्रभवेत् परः प्रभुः ॥

నతాః స్మ తే నాథ సదాంఘ్రిపంకజం విరించివైరించ్యసురేంద్రవందితమ్ ।
పరాయణం క్షేమమిహేచ్ఛతాం పరం న యత్ర కాలః ప్రభవేత్ పరః ప్రభుః ॥
వ్యాఖ్య
యుద్ధానంతరము కృష్ణుడు హస్తినాపురమునుడి ద్వారకానగరమునకేగుచున్న సందర్భములో ఎంతోకాలమునకు తిరిగి తమనగరములో కృష్ణుని చూడగలిగిన అదృష్టమునకు పురజనులు ఈ విధముగా స్పందించుచున్నారు.
సాధన
నీ పాదాబ్జము బ్రహ్మపూజ్యము గదా, నీ సేవ సంసార సం
తాపధ్వంసినియౌఁ గదా,
సకలభద్రశ్రేణులం బ్రీతితో
నాపాదింతుఁ గదా,
ప్రపన్నులకుఁ గాలాధీశ! కాలంబు ని
ర్వ్యాపారంబు గదయ్య
చాలరు నినున్ వర్ణింప బ్రహ్మాదులున్.
nI pAdAbjamu brahmapUjyamu gadA, nI sEva saMsAra saM
tApadhvaMsiniyau@M gadA,
sakalabhadraSrENulaM brItitO
nApAdiMtu@M gadA,
prapannulaku@M gAlAdhISa! kAlaMbu ni
rvyApAraMbu gadayya
cAlaru ninuna^ varNiMpa brahmAduluna^.
కార్యపత్రం (Worksheet)
కార్యపత్రం, పద్యసహితం (Worksheet with padyam)