పోతన భాగవత పరిమళం

"ఎచ్చటఁ బుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికిన్" [7.46]

గ్రంథ క్రమము 92   Prev  /  Next

(తరగతి క్రమము 138)
పవనములు జయించి పరిహృతసంగుఁడై
యింద్రియముల గర్వమెల్ల మాపి
హరి విశాలరూపమందుఁ జిత్తముఁ జేర్చి
నిలుపవలయు బుద్ధి నెఱపి బుధుఁడు
ఛందస్సు (Meter):
స్కంధము (Chapter): 2
సంఖ్య (Number): 15
"ధారణ యే క్రీయ నిలుచును?" (2.13) అని అడిగిన పరీక్షుత్తునకు శుకుడు ఈ విధముగా చెప్పనారంభించెను. ఈ పద్యమును ఈ క్రింది శ్లోకమునకు పోతనగారు చేసిన అనువాదము.

जितासनो जितश्वासो जितसङ्गो जितेन्द्रियः ।
स्थूले भगवतो रूपे मनः सन्धारयेद्धिया ॥

జితాసనో జితశ్వాసో జితసఙ్గో జితేంద్రియః ।
స్థూలే భగవతో రూపే మనః సంధారయేద్ధియా ॥
వ్యాఖ్య
పవనములు జయించి = [యోగి యగు వాడు] ప్రాణవాయువులను నిగ్రహించుకొని;
పరిహృతసంగుఁడై = ఇంద్రియభోగములను విడనాడి;
యింద్రియముల గర్వమెల్ల మాపి = ఇంద్రియములను పూర్తిగా అదుపులో ఉంచుకొని;
హరి విశాలరూపమందుఁ జిత్తముఁ జేర్చి = భగవంతుని అనంత రూపమును మనసులో యుంచుకొని;
నిలుపవలయు బుద్ధి నెఱపి బుధుఁడు = [ఆ భగవంతుని పై] జ్ఞాని తన బుద్ధిని నిలుపవలెను;
సాధన
పవనములు జయించి పరిహృతసంగుఁడై
యింద్రియముల గర్వమెల్ల మాపి
హరి విశాలరూపమందుఁ జిత్తముఁ జేర్చి
నిలుపవలయు బుద్ధి నెఱపి బుధుఁడు
pavanamulu jayiMci parihRtasaMgu@MDai
yiMdriyamula garvamella mApi
hari viSAlarUpamaMdu@M jittamu@M jErci
nilupavalayu buddhi ne~rapi budhu@MDu
కార్యపత్రం (Worksheet)
కార్యపత్రం, పద్యసహితం (Worksheet with padyam)