పోతన భాగవత పరిమళం

"ఎచ్చటఁ బుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికిన్" [7.46]

గ్రంథ క్రమము 177   Prev  /  Next

(తరగతి క్రమము 92)
నిరహంకృతుండును బుధుండును నిరాశియుఁ బరిపూర్ణుండును
ననన్య ప్రేరితుండును నృశిక్షాపరుండును
నిజమార్గ సంస్థితుండును నిఖిలధర్మ భావనుండును
నైన పరమేశ్వరునకు నమస్కరించెద [నని యుపనిషదర్థంబులు…]
ఛందస్సు (Meter): వచనము
స్కంధము (Chapter): 8
సంఖ్య (Number): 11
ఈ వచనము, దీనికి పూర్వపు పద్యము ఈ క్రింది సంస్కృత శ్లోకములకు పోతనగారు చేసిన తెలుగు అనువాదము.

ఏన చేతయతే విశ్వం విశ్వం చేతయతే న యమ్।
యో జాగర్తి శయానేऽస్మిన్నాయం తం వేద వేద సః॥
ఆత్మావాస్యమిదం విశ్వం యత్ కిఞ్చజ్జగత్యాం జగత్।
తేన త్యక్తేన భుఞ్జీథా మా గృధః కస్యస్విద్ధనమ్ ॥
యం పశ్యతి న పశ్యంతం చక్షుర్యస్య న రిష్యతి।
తం భూతనిలయం దేవం సుపర్ణముపధావత॥
న యస్యాద్యంతౌ మధ్యం చ స్వః పరో నాంతరం బహిః।
విశ్వస్యామూని యద్ యస్మాద్ విశ్వం చ తదృతం మహత్ ॥
స విశ్వకాయః పురూహుత ఈశః సత్యః స్వయంజ్యోతిరజః పురాణః।
ధత్తేऽస్యజన్మాద్యజయాత్మశక్త్యా విద్యయోదస్య నిరీహ ఆస్తే ॥
తమీహమానం నిరగఙ్కృతం బుధం నిరాశిషం పూర్ణమనన్యచోదినమ్ ।
నృఙ్ శిక్షయంతం నిజవర్త్మసంస్థితం ప్రభుం ప్రపద్యేఖిలధర్మభావనమ్॥
వ్యాఖ్య
ప్రథమ మనువైన స్వాయంభువ మనువు "కామభోగ విరతిన్" భూభారమును విడిచి, తన భార్య శతరూప తో సునందానదికి సమీపములో వ్రతమును ఆచరించి, "ఏకపథస్థుడై" (8.8) తపస్సు చేయుచు తన మనస్సులో ఈ విధముగా ప్రార్థించెనని సూతుడు చెప్పెను. ఈ పద్య వచనములు ఈ క్రింది సంస్కృత శ్లోకములకు పోతనగారు చేసిన తెలుగు అనువాదము:
సాధన
నిరహంకృతుండును బుధుండును నిరాశియుఁ బరిపూర్ణుండును
ననన్య ప్రేరితుండును నృశిక్షాపరుండును
నిజమార్గ సంస్థితుండును నిఖిలధర్మ భావనుండును
నైన పరమేశ్వరునకు నమస్కరించెద [నని యుపనిషదర్థంబులు…]
nirahaMkRtuMDunu budhuMDunu nirASiyu@M baripUrNuMDunu
nananya prErituMDunu nRSikshAparuMDunu
nijamArga saMsthituMDunu nikhiladharma bhAvanuMDunu
naina paramESvarunaku namaskariMceda
కార్యపత్రం (Worksheet)
కార్యపత్రం, పద్యసహితం (Worksheet with padyam)