పోతన భాగవత పరిమళం

"ఎచ్చటఁ బుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికిన్" [7.46]

గ్రంథ క్రమము 1   Prev  /  Next

(తరగతి క్రమము 3)
శ్రీకైవల్యపదంబుఁ జేరుటకునై చింతించెదన్‌, లోక ర
క్షైకారంభకు, భక్తపాలన కళాసంరంభకున్‌, దానవో
ద్రేక స్తంభకుఁ, గేళి లోల విలసద్దృగ్జాల సంభూత నా
నా కంజాత భవాండ కుంభకు, మహానందాంగనా డింభకున్‌.
ఛందస్సు (Meter): శార్దూలము
స్కంధము (Chapter): 1
సంఖ్య (Number): 1
వ్యాఖ్య
భాగవతగ్రంథ అనువాదమునకు పీఠికగా శ్రీకృష్ణుని స్మరించుచూ పోతనగారు వ్రాసిన పద్యము.
సాధన
శ్రీకైవల్యపదంబుఁ జేరుటకునై చింతించెదన్‌, లోక ర
క్షైకారంభకు,
భక్తపాలన కళాసంరంభకున్‌, దానవో
ద్రేక స్తంభకుఁ,
గేళి లోల విలసద్దృగ్జాల సంభూత నా
నా
కంజాత భవాండ కుంభకు, మహానందాంగనా డింభకున్‌.
SrIkaivalyapadaMbu jEruTakunai ciMtiMcedan, lOka ra
kshaikAraMbhaku,
bhaktapAlana kaLAsaMraMbhakun, dAnavO
drEka staMbhaku,
gELi lOla vilasaddRgjAla saMbhUta nA
nA
kaMjAta bhavAMDa kuMbhaku, mahA naMdAMganA DiMbhakun.
కార్యపత్రం (Worksheet)
కార్యపత్రం, పద్యసహితం (Worksheet with padyam)