పోతన భాగవత పరిమళం

"ఎచ్చటఁ బుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికిన్" [7.46]

αβ'cal 129   Prev  /  Next

(తరగతి క్రమము 16)
పుణ్యకీర్తనుఁడైన భువనేశు చరితంబు బ్రహ్మతుల్యంబైన భాగవతము
సకలపురాణరాజము దొల్లి లోక భద్రముగ ధన్యముగ మోదముగఁ బ్రీతి
భగవంతుఁడగు వ్యాసభట్టారకుఁ డొనర్చి శుకుఁ డనియెడు తన సుతునిచేతఁ
జదివించె నింతయు సకల వేదేతిహాసములలోపల నెల్ల సారమైన

యీ పురాణమెల్ల నెలమి నా శుకయోగి
గంగ నడుమ నిల్చి ఘన విరక్తి
యొదవి మునులతోడ నుపవిష్టుఁడగు పరీ
క్షిన్నరేంద్రుఁ డడుగఁ జెప్పె వినుఁడు.
ఛందస్సు (Meter): సీసము, ఆటవెలది
స్కంధము (Chapter): 1
సంఖ్య (Number): 73
ఈ రెండు పద్యములు ఈ క్రింది మూడు శ్లోకములకు పోతన గారు చేసిన అనువాదము:

इदं भागवतम नाम पुराणं ब्रह्मसम्मितम्।
उत्तमश्लोककारितम् चाकर भगवानृषिः।
निःश्रेयसाय लोकस्य धन्यं स्वस्त्ययनं महत्॥
तदिदं ग्रहयामास सुतमात्मवताम् वरं।
सर्ववेदेतिहासानां सारं सारं समुद् धृतम् ॥
स तु संश्रावयामास महाराजं परीक्षितं।
प्रयोपविष्टं गङगायां परीतं परमर्षिभिः॥

ఇదం భాగవతం నామ పురాణం బ్రహ్మసమ్మితం।
ఉత్తమశ్లోకచరితం చకార భగవానృషిః।
నిఃశ్రేయసాయ లోకస్య ధన్యం స్వస్త్యయనం మహత్॥
తదిదం గ్రాహయామాస సుతమాత్మవతాం వరం।
సర్వవేదేతిహాసానాం సారం సారం సముద్ధృతం॥
స తు సంశ్రావయామాస మహారాజం పరీక్షితం।
ప్రాయోపవిష్టం గఞ్గాయాం పరీతం పరమర్షిభిః॥
వ్యాఖ్య
పుణ్యకీర్తనుడైన = పవిత్ర గ్రంధాలు కీర్తించుచున్న;
భువనేశు చరితంబు = లొకేశ్వరుని చరిత్ర (కలిగినది);
బ్రహ్మతుల్యంబైన భాగవతము = పరమాత్మతో సమానమైన ఈ భాగవతము;
సకలపురాణరాజము = (ఈ భాగవతము) అన్ని పురాణముల కంటె శ్రేష్టమైనది;
తొల్లి = పూర్వము;
లోక భద్రముగ = ప్రజలకు శుభము కలుగవలెనని;
ధన్యముగ = పుణ్యము కలుగవలెనని;
మోదముగ = సంతోషము కలుగవలెనని;
ప్రీతి = స్నేహ భావముతో;
భగవంతుడగు = భగవంతుడైన;
వ్యాసభట్టారకుఁ డొనర్చి = వ్యాస ముని రచించి;
శుకుఁ డనియెడు తన సుతునిచేతఁ జదివించె = శుకుడు అని పిలువబడు తన కుమారుని చేత చదివించెను;
సకల వేదేతిహాసమములలోపల నెల్ల సారమైన యీ పురాణమెల్ల = అన్ని వేదములు, ఇతిహాసములలో గల సారమును కలిగిన ఈ భాగవత పురాణము;
ఎలమి + ఆ శుకయోగి = ఆ శుకయోగి సంతోషముతో;
గంగ నడుమ నిల్చి = (పవిత్రమైన) గంగా నది తీరములో మరణము కొఱకు వేచియున్న;
ఘన విరక్తి యొదవి = చాలా వైరాగ్య బుద్ధి కలిగినట్టి (అన్న పానములు మానివేసిన);
మునులతోడ + ఉపవిష్టుఁ డగు = (అనేక మంది) మునులతో పాటు చేరి కూర్చున్నటువంటి;
పరీక్షిన్నరేంద్రుఁడు + అడుగఁ జెప్పె = పరీక్షిత్తు అనే మహారాజు అడుగగా చెప్పెను;
వినుడు = వినుము;

భాగవతమును అర్ధము చేసికొనుటకు సహాయము చేయు మూడు నియమములను కూడా ఇక్కడ సూచింపబడినవి: గఞ్గాయాం, ప్రాయోపవిష్టం, పరీతం పరమర్షిభిః . ఈ మూడిటిని పోతనగారు గంగ నడుమ నిలిచి, ఘన విరక్తి యొదవి, మునులతోడ నుపవిష్టుడగుట - అని అనువదించారు. అనగా (1) పుణ్యక్షేత్రములను దర్శించుట, (2) వైరాగ్య బుద్ధి కలిగి యుండుట, (3) సత్సంగము కలిగియుండుట అని చెప్పుకొనవచ్చును. ఈ మూడు నియమములు కర్మలను (పుణ్య క్షేత్రములను దర్శించుట ద్వారా), మనస్సును (వైరాగ్య బుద్ధి ద్వారా), వాక్కును (సజ్జన సాంగత్యము ద్వారా) కూడా పరిశుద్ధిజేసి భాగవత పురాణము యొక్క సారమును గ్రహించుటకు అధికముగ దోహదపడును.
సాధన
పుణ్యకీర్తనుఁడైన భువనేశు చరితంబు బ్రహ్మతుల్యంబైన భాగవతము
సకలపురాణరాజము దొల్లి లోక భద్రముగ ధన్యముగ మోదముగఁ బ్రీతి
భగవంతుఁడగు వ్యాసభట్టారకుఁ డొనర్చి శుకుఁ డనియెడు తన సుతునిచేతఁ
జదివించె
నింతయు సకల వేదేతిహాసములలోపల నెల్ల సారమైన

యీ పురాణమెల్ల
నెలమి నా శుకయోగి
గంగ నడుమ నిల్చి ఘన విరక్తి
యొదవి
మునులతోడ నుపవిష్టుఁడగు పరీ
క్షిన్నరేంద్రుఁ డడుగఁ జెప్పె వినుఁడు.
puNyakIrtanu@MDaina bhuvanESu caritaMbu brahmatulyaMbaina bhAgavatamu
sakalapurANarAjamu dolli lOka bhadramuga dhanyamuga mOdamuga@M brIti
bhagavaMtu@MDagu vyAsabhaTTAraku@M Donarci Suku@M DaniyeDu tana sutunicEta@M
jadiviMce
niMtayu sakala vEdEtihAsamulalOpala nella sAramaina

yI purANamella
nelami nA SukayOgi
gaMga naDuma nilci ghana virakti
yodavi
munulatODa nupavishTu@MDagu parI
kshinnarEMdru@M DaDuga@M jeppe vinu@MDu.
కార్యపత్రం (Worksheet)
కార్యపత్రం, పద్యసహితం (Worksheet with padyam)