పోతన భాగవత పరిమళం

"ఎచ్చటఁ బుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికిన్" [7.46]

తరగతి క్రమము 129   Prev  /  Next

అజ్ఞుల్ గొందఱు నేము దా మనుచు మాయం జెంది సర్వాత్మకుం
బ్రజ్ఞాలభ్యు దురన్వయక్రమములన్ భాషింపఁగా నేర, రా
జిజ్ఞాసాపథమందు మూఢులు గదా చింతింప బ్రహ్మాది వే
దజ్ఞుల్ తత్పరమాత్ము విష్ణు నితరుల్ దర్శింపఁగా నేర్తురే?
ఛందస్సు (Meter): శార్దూలము
స్కంధము (Chapter): 7
సంఖ్య (Number): 148
ప్రహ్లాదుడు తన తండ్రియైన హిరణ్యకశిపునితో ఇట్లు పలికెను. ఈ పద్యము ఈ క్రింది రెండు సంస్కృత శ్లోకములకు పోతనగారు చేసిన తెలుగు అనువాదము:

स यदानुव्रतः पुंसां पशुबुद्धिर्विभिद्यते ।
अन्य एष तथान्योऽहमिति भेदगतासती ॥
स एष आत्मा स्वपरेत्यबुद्धिभिर्दुरस्तयानुक्रमणो निरूप्यते ।
मुह्यन्ति यद्वर्त्मनि वेदवादिनो ब्रह्मादयो ह्येष भिनन्ति मे मतिम् ॥

స యదానువ్రతః పుంసాం పశువృద్ధిర్విభిద్యతే ।
అన్య ఏష తథాన్యోహమితి భేదగతాసతీ ॥
స ఏష ఆత్మా స్వపరేన్యవృద్ధిభిర్దురత్యయానుక్రమణో నిరూప్యతే ।
ముహ్యన్తి యద్వర్త్మని వేదవాదినో బ్రహ్మాదయో హ్యేష భినన్తి మే మతిమ్ ॥
వ్యాఖ్య
సాధన
అజ్ఞుల్ గొందఱు నేము దా మనుచు మాయం జెంది సర్వాత్మకుం
బ్రజ్ఞాలభ్యు దురన్వయక్రమములన్ భాషింపఁగా నేర, రా
జిజ్ఞాసాపథమందు
మూఢులు గదా చింతింప బ్రహ్మాది వే
దజ్ఞుల్
తత్పరమాత్ము విష్ణు నితరుల్ దర్శింపఁగా నేర్తురే?
aj~nul goMda~ru nEmu dA manucu mAyaM jeMdi sarvAtmakuM
braj~nAlabhyu duranvayakramamulan bhAshiMpa@MgA nEra, rA
jij~nAsApathamaMdu
mUDhulu gadA ciMtiMpa brahmAdi vE
daj~nul
tatparamAtmu vishNu nitarul darSiMpa@MgA nErturE?
కార్యపత్రం (Worksheet)
కార్యపత్రం, పద్యసహితం (Worksheet with padyam)