పోతన భాగవత పరిమళం

"ఎచ్చటఁ బుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికిన్" [7.46]

αβ'cal 131   Prev  /  Next

(తరగతి క్రమము 44)
పుట్టం బుట్ట శిరంబునన్ మొలవ, నంభోయానపాత్రంబునన్
నెట్టం గల్గను, గాళిఁ గొల్వను, బురాణింపన్ దొరంకొంటి మీఁ
దెట్టే వెంటఁ జరింతు దత్సరణి నా కీవమ్మ! యో యమ్మ! మేల్
పట్టున్ మానకుమమ్మ! నమ్మితిఁ జుమీ బ్రాహ్మీ! దయాంభోనిధీ!
ఛందస్సు (Meter): శార్దూలము
స్కంధము (Chapter): 1
సంఖ్య (Number): 7
పోతనగారు భాగవత అనువాదమునకు ముందు తన ఇష్టదేవతా ప్రార్థన చేయుచూ వ్రాసిన పద్యములలో ఇది యొకటి:
వ్యాఖ్య
పుట్టం = (నేను) పుట్టలేదు;
పుట్ట శిరంబునన్ మొలవ = తలమీద పుట్ట మొలిచిన (వాల్మీకి వలె);
అంభోయానపాత్రంబునన్ = నీటి లో పడవను;
నెట్టం గల్గను = నెట్ట లేను (అనగా "పడవలో ప్రభవించిన వ్యాసుడను కాను" అని జంధ్యాల పాపయ్య శాస్త్రిగారి అనువాదము);
కాళిఁ గొల్వను = (నేను) కాళికాదేవిని కొలుచు కాళిదాసును కాను (పాపయ శాస్త్రి గారి అనువాదము); - (అయినప్పటికిని) -
పురాణింపన్ దొరంకొంటి = (ఈ భాగవత) పురాణమును (తెలిగించుటకు) పూనుకొంటిని;
మీఁ దెట్టే వెంటఁ జరింతు = "ఏం చెయ్యలో ఏమీ తోచటం లేదు" (పాపయ్య శాస్త్రి గారి అనువాదము);
తత్సరణి నా కీవమ్మ! = (నేను వెళ్ళవలసిన) ఆ దారిని నాకు ఇవ్వు (చూపుము) తల్లీ!;
యో యమ్మ! = ఓ అమ్మా!;
మేల్ పట్టున్ మానకుమమ్మ! = (నీ) స్నేహపూర్వక (నా చేతి) పట్టును వదలకు తల్లీ!;
నమ్మితిఁ జుమీ = (నిన్ను) నిజముగా నమ్మితినమ్మా;
బ్రాహ్మీ! = (ఓ) సరస్వతీ దేవీ;
దయాంభోనిధీ! = (ఓ) దయా సముద్రమా!

ఈ పద్యమునకు అనువాదము కష్టమయినదిగా తోయుచున్నది. "కాళిఁ గొల్వను" అనే పదములకు "కాళిదాసుడను కానమ్మా" అని చాలా ఊహా జనితమయిన అనువాదమును చేశారు పాపయ్య శాస్త్రిగారు. కానీ "కాళిఁ గొల్వను" అనే పదముల తరువాత నున్న కామాను (comma) తొలగించినయెడల "కాళిఁ గొల్వను బురాణింపన్ దొరంకొంటి" అని అర్థము వచ్చును (విశదీకరించిన పుదూర్ జగదీశ్వరన్ గారికి ధన్యవాదములు), అనగా "కాళికా దేవిని కొలుచుటకు నేను ఈ పురాణమును తెలిగించుటకు పూనుకొన్నాను" అను అర్థము వచ్చును. అదేవిధముగా "అంభోయానపాత్రంబునన్ నెట్టం గల్గను" అనే పదములకు పాపయ్య శాస్త్రిగారు "పడవలో ప్రభవించిన వ్యాసుడను గాను" అని దీర్ఘాలోచనతో అనువదించారు.
సాధన
పుట్టం బుట్ట శిరంబునన్ మొలవ, నంభోయానపాత్రంబునన్
నెట్టం గల్గను, గాళిఁ గొల్వను, బురాణింపన్ దొరంకొంటి మీఁ
దెట్టే వెంటఁ జరింతు దత్సరణి నా కీవమ్మ! యో యమ్మ!
మేల్
పట్టున్ మానకుమమ్మ!
నమ్మితిఁ జుమీ బ్రాహ్మీ! దయాంభోనిధీ!
puTTaM buTTa SiraMbunan molava, naMbhOyAnapAtraMbunan
neTTaM galganu, gALi@M golvanu, burANiMpan doraMkoMTi mI@M
deTTE veMTa@M jariMtu datsaraNi nA kIvamma! yO yamma!
mEl
paTTun mAnakumamma!
nammiti@M jumI brAhmI! dayAMbhOnidhI!
కార్యపత్రం (Worksheet)
కార్యపత్రం, పద్యసహితం (Worksheet with padyam)