పోతన భాగవత పరిమళం

"ఎచ్చటఁ బుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికిన్" [7.46]

అక్షర క్రమము 73   Prev  /  Next

(తరగతి క్రమము 85)
జలజాతాక్షుఁడు శౌరి డగ్గఱె మహాసౌధాగ్ర శృంగారకన్
గలహంసావృత హేమపద్మపరిఖా కాసారకన్ దోరణా
వళి సంఛాదిత తారకన్ దరులతా వర్గానువేలోదయ
త్ఫలపుష్పాంకుర కోరకన్ మణిమయ ప్రాకారకన్ ద్వారకన్.
ఛందస్సు (Meter): మత్తేభము
స్కంధము (Chapter): 1
సంఖ్య (Number): 243
ఈ క్రింది సంస్కృత శ్లోకమునందు మొదటి పాదములో, శ్రీకృష్ణుడు "మిక్కిలి సంపదగలిగిన [స్వృద్ధాన్] ఆనర్తాన్ [ద్వారక] అను పట్టణమునకు దగ్గరయెను" అని వర్ణింపబడినది. దీనిని పోతనగారు చాలా వైభముగా ఈ పద్యమునందు వివరించి చెప్పెను. శ్లోకమునందు న-కార పొల్లు [న్] నాలుగు మార్లు వచ్చినది. పోతనగారు తన పద్యములో కూడా ద్రుతాంతములను [న్-తో అంతమగు పదములను] పదే పదే వాడెను.

आनर्तान् स उपाव्रज्य स्वृद्धान् जनपदान् स्वकान् ।
दध्मौ दरवरं तेषां विषादं श्मयन्निव ॥

ఆనర్తాన్ స ఉపావ్రజ్య స్వృద్ధాన్ జనపదాన్ స్వకాన్ ।
దధ్మౌ దరవరం తేషాం విషాదం శమయన్నివ ॥
వ్యాఖ్య
[యుద్ధానంతరము శ్రీకృష్ణుడు హస్తినాపురమునుండి బయలుదేరి ద్వారకానగరమునకు ప్రయాణమై, నగర సమీపమునకు వచ్చిన సందర్భములో సూతుడు నగర సౌందర్యాన్ని వర్ణించుచూ ఈవిధముగా చెప్పెను.] జలజ+ఆత+అక్షుడు = తామర రేకుల వంటి కన్నులు గల; శౌరి = శ్రీకృష్ణుడు; డగ్గఱె = సమీపించెను;
మహాసౌధ+అగ్ర శృంగారకన్ = పెద్ద మేడలు అనేకములుగా అలంకరింపబడిన నగరమునకు; కలహంస+ఆవృత = చుట్టూ రాజహంసలతో; హేమపద్మ = బంగారు పద్మములతో; పరిఖా = గుంటలు; కాసారకన్ = సరస్సులు గల నగరమునకు; తోరణ + ఆవళి = తోరణముల వరుసలతో; సంఛాదిత తారకన్ = నక్షత్రములవలె వెలుగుతున్న ఆవరణలు గల నగరమునకు; తరులతా వర్గ + అనువేల + ఉదయత్ = చెట్లు, తీగెల వర్గములు ఎల్లప్పుడు ఉదయించుచు; ఫలపుష్ప+అంకుర కోరకన్ = ఫలములు, పుష్పములు, మొగ్గలు, తామర మొగ్గలు గల నగరమునకు; మణిమయ ప్రాకారకన్ = ముత్యములతో కూడిన చుట్టుగోడలుగల నగరమునకు; ద్వారకన్ = ద్వారకకు.
సాధన
జలజాతాక్షుఁడు శౌరి డగ్గఱె మహాసౌధాగ్ర శృంగారకన్
గలహంసావృత హేమపద్మ పరిఖా కాసారకన్ దోరణా
వళి సంఛాదిత తారకన్
దరులతా వర్గానువేలోదయ
త్ఫలపుష్పాంకుర కోరకన్
మణిమయ ప్రాకారకన్ ద్వారకన్.
jalajAtAkshu@MDu Sauri Dagga~re mahAsaudhAgra SRMgArakana^
galahaMsAvRta hEmapadma parikhA kAsArakana^ dOraNA
vaLi saMCAdita tArakana^
darulatA vargAnuvElOdaya
tphalapushpAMkura kOrakana^
maNimaya prAkArakana^ dvArakana^.
కార్యపత్రం (Worksheet)
కార్యపత్రం, పద్యసహితం (Worksheet with padyam)