పోతన భాగవత పరిమళం

"ఎచ్చటఁ బుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికిన్" [7.46]

గ్రంథ క్రమము 113   Prev  /  Next

(తరగతి క్రమము 104)
పరులెవ్వరు? దా మెవ్వరు?
పరికింపఁగ నేక మగుట భావింపరు, త
త్పరమజ్ఞానము లేమిని
బరులును నే మనుచుఁ దోఁచుఁ బ్రాణుల కెల్లన్
ఛందస్సు (Meter): కందము
స్కంధము (Chapter): 7
సంఖ్య (Number): 69
హిరణ్యకశిపుడు, తన తమ్ముని మరణమునకు శోకించుచున్న బంధువులకు ఈ విధముగా చెప్పి ఊరడించెను. ఈ పద్యము ఈ క్రింది సంస్కృత శ్లోకమునకు పోతనగారు చేసిన తెలుగు అనువాదము:

क आत्मा कः परो वात्र स्वीयः पारक्य एव वा ।
स्वपराभिनिवेशेन विनाज्ञानेन देहिनाम् ॥

క ఆత్మా కః పరో వాత్ర స్వీయః పారక్య ఏవ వా ।
స్వపరాభినివేశేన వినాజ్ఞానేన దేహినాం ॥
వ్యాఖ్య
నారదుడు ధర్మరాజుతో చెప్పిన కథ. ఇందులో హిరణ్యకశిపుని తమ్ముడైన హిరణ్యాక్షుడు మరణించును. తద్మూలమున వాని బంధువులు శోకించెదరు. ఓదార్చుటకు హిరణ్యాక్షుడు "సుయజ్ఞోపాఖ్యానము"ను బోధించెను. అందు యముడు బాలుని రూపమున వచ్చి సుయజ్ఞుని మరణమునకు శోకించుచున్న భార్యలను ఓదార్చును. ఈ కథను చెప్పిన పిదప హిరణ్యకశిపుడు ఈ విధముగా చెప్పును.

పరులెవ్వరు? దా మెవ్వరు? = ఇతరులు ఎవరు? తాము ఎవరు?
పరికింపఁగ నేక మగుట భావింపరు = పరీక్షించి చూడగా ఆ రెండు ఒకటేనని తెలిసికొనలేరు.
తత్పరమజ్ఞానము లేమిని = ఆ పరమాత్మ జ్ఞానము లేనందున
పరులును నే మనుచుఁ దోఁచుఁ = ఇతరులు, మేము అనే (శారీరక భేద) భావము కలుగును
ప్రాణుల కెల్లన్ = అన్ని ప్రాణులకును.
సాధన
పరులెవ్వరు? దా మెవ్వరు?
పరికింపఁగ నేక మగుట భావింపరు,
త్పరమజ్ఞానము లేమిని
బరులును నే మనుచుఁ దోఁచుఁ బ్రాణుల కెల్లన్
parulevvaru? dA mevvaru?
parikiMpa@Mga nEka maguTa bhAviMparu, ta
tparamaj~nAnamu lEmini
barulunu nE manucu@M dO@Mcu@M brANula kellan
కార్యపత్రం (Worksheet)
కార్యపత్రం, పద్యసహితం (Worksheet with padyam)