పోతన భాగవత పరిమళం

"ఎచ్చటఁ బుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికిన్" [7.46]

αβ'cal 121   Prev  /  Next

(తరగతి క్రమము 150)
పాంచభౌతికమైన భవనంబు దేహంబు పురుషుండు దీనిలోఁ బూర్వ కర్మ
వశమున నొకవేళ వర్తించు దీపించుఁ దఱియైన నొకవేళఁ దలఁగి పోవుఁ,
జెడునేని దేహంబు సెడుఁగాని పురుషుండు సెడఁ డాతనికి నింతసేటు లేదు,
పురుషునికిని దేహపుంజంబునకు వేఱు గాని యేకత్వంబు గాన రాదు,

దారువుల వెలుంగు దహనుని కైవడిఁ
గాయములఁ జరించు గాలి భంగి
నాళలీనమైన నభము చాడ్పున వేఱు
దెలియవలయు దేహి దేహములకు.
ఛందస్సు (Meter): సీసము, ఆటవెలది
స్కంధము (Chapter): 7
సంఖ్య (Number): 51
వ్యాఖ్య
పాంచభౌతికమైన భవనంబు దేహంబు = పంచభూతములో నిర్మింపబడిన ఒక ఇల్లు వంటిది ఈ శరీరము;
పురుషుండు దీనిలోఁ = అట్టి శరీరములో జీవాత్మ చేరి;
పూర్వ కర్మ వశమున = పూర్వజన్మలోని కర్మల ఫలితంగా;
ఒకవేళ వర్తించు = ఒక్కొక్క సమయంలో ప్రవర్తిస్తూ;
దీపించుఁ = వెలిగిపోతూ;
తఱియైన నొకవేళఁ దలఁగి పోవుఁ = సమయం వచ్చినప్పుడు (ఈ దేహం చనిపోయినపుడు) వెళ్ళిపోతూ ఉంటాడు;
చెడునేని దేహంబు సెడుఁగాని = చెడిపోయినట్లయితే ఈ శరీరమే చెడిపోవును గాని;
పురుషుండు సెడఁడు = ఆ జీవాత్మ మాత్రం చెడిపోడు;
ఆతనికి నింతసేటు లేదు = ఆ జీవాత్మకు కొంచెమైనా నష్టము లేదు;
పురుషునికిని దేహపుంజంబునకు వేఱు గాని = జీవాత్మ, శరీరము ఈ రెండూ వేఱు వేఱే గాని;
యేకత్వంబు గాన రాదు = ఆ రెండు ఒకటే యని మాత్రం చెప్పుటకు ఆధారం లేదు;

దారువుల వెలుంగు దహనుని కైవడిఁ = వెలుగుతున్న కట్టెలలో వ్యాపించిన నిప్పు వలె (కట్టె వేరు, దానిని వెలిగించు నిప్పు వేరు);
కాయములఁ జరించు గాలి భంగి = ఈ శరీరములలో తిరుగు గాలి వలె (శరీరము వేరు, అందలి గాలి వేరు);
నాళలీనమైన నభము చాడ్పున = తామర తూళ్ళలో వ్యాపించిన శూన్యం వలె (తామర తూడు వేరు, అందలి శూన్యం వేరు);
వేఱు దెలియవలయు దేహి దేహములకు = ఈ శరీరమునకు, అందలి జీవాత్మకు వ్యత్యాసము తెలిసికొనవలెను;
సాధన
పాంచభౌతికమైన భవనంబు దేహంబు పురుషుండు దీనిలోఁ బూర్వ కర్మ
వశమున
నొకవేళ వర్తించు దీపించుఁ దఱియైన నొకవేళఁ దలఁగి పోవుఁ,
జెడునేని దేహంబు సెడుఁగాని పురుషుండు సెడఁ డాతనికి నింతసేటు లేదు,
పురుషునికిని దేహపుంజంబునకు వేఱు గాని యేకత్వంబు గాన రాదు,

దారువుల వెలుంగు దహనుని కైవడిఁ
గాయములఁ జరించు గాలి భంగి
నాళలీనమైన నభము చాడ్పున వేఱు
దెలియవలయు
దేహి దేహములకు.
pAMcabhautikamaina bhavanaMbu dEhaMbu purushuMDu dInilO@M bUrva karma
vaSamuna
nokavELa vartiMcu dIpiMcu@M da~riyaina nokavELa@M dala@Mgi pOvu@M,
jeDunEni dEhaMbu seDu@MgAni purushuMDu seDa@M DAtaniki niMtasETu lEdu,
purushunikini dEhapuMjaMbunaku vE~ru gAni yEkatvaMbu gAna rAdu,

dAruvula veluMgu dahanuni kaivaDi@M
gAyamula@M jariMcu gAli bhaMgi
nALalInamaina nabhamu cADpuna vE~ru
deliyavalayu
dEhi dEhamulaku.
కార్యపత్రం (Worksheet)
కార్యపత్రం, పద్యసహితం (Worksheet with padyam)