పోతన భాగవత పరిమళం

"ఎచ్చటఁ బుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికిన్" [7.46]

తరగతి క్రమము 13   Prev  /  Next

అలసులు మందబుద్ధియుతు లల్పతరాయువు లుగ్రరోగసం
కలితులు మందభాగ్యులు సుకర్మము లెవ్వియుఁ జేయజాల రీ
కలియుగమందు మానవులు; గావున నెయ్యది సర్వసౌఖ్యమై
యలవడు? నేమిటం బొడము నాత్మకు శాంతి? మునీంద్ర! చెప్పవే?
ఛందస్సు (Meter): చంపకమాల
స్కంధము (Chapter): 1
సంఖ్య (Number): 44
ఈ పద్యము ఈ క్రింది సంస్కృత శ్లోకమునకు పోతనగారు చేసిన తెలుగు అనువాదము:

प्रायेणाल्पायुषः सभ्य कलावस्मिन् युगे जनाः।
मंदाः सुमन्दमतयो मंदभाग्या ह्युपद्रुताः॥

ప్రాయేణాల్పాయుషః సభ్య కలావస్మిన్ యుగే జనాః।
మందాః సుమందమతయో మందభాగ్యా హ్యుపద్రుతాః॥
వ్యాఖ్య
అలసులు = సోమరులు;
మందబుద్ధియుతుల్ = తెలివి హీనులు;
అల్పతరాయువుల్ = తక్కువ కాలము మాత్రమే జీవించగలిగిన వారు;
ఉగ్రరోగ సంకలితులు = భయంకరమైన వ్యాధులు తెచ్చుకొనువారు;
మందభాగ్యులు = దురదృష్టవంతులు;
సుకర్మములెవ్వియు = సత్కార్యములను;
చేయజాలరు = చేయలేరు;
ఈ కలియుగమందు మానవులు = ఈ కలియుగములోని మానవులు;
కావున నెయ్యది = కనుక ఎటువంటి (మార్గము);
సర్వసౌఖ్యమై యలవడు = అందరికి మంచిని చేకూర్చును?;
ఏమిటం బొడము = ఏ మార్గము పుట్టించును;
ఆత్మకు శాంతి = ఆత్మకు శాంతి;
మునీంద్ర = ఓ మునులలో శ్రేష్ఠుడైన వాడా (సూతుడా);
చెప్పవే = తెలియజేయుము;
సాధన
అలసులు మందబుద్ధియుతు లల్పతరాయువు లుగ్రరోగసం
కలితులు
మందభాగ్యులు సుకర్మము లెవ్వియుఁ జేయజాల రీ
కలియుగమందు మానవులు;
గావున నెయ్యది సర్వసౌఖ్యమై
యలవడు?
నేమిటం బొడము నాత్మకు శాంతి? మునీంద్ర! చెప్పవే?
alasulu maMdabuddhiyutu lalpatarAyuvu lugrarOgasaM
kalitulu
maMdabhAgyulu sukarmamu levviyu@M jEyajAla rI
kaliyugamaMdu mAnavulu;
gAvuna neyyadi sarvasaukhyamai
yalavaDu?
nEmiTaM boDamu nAtmaku SAMti? munIMdra! ceppavE?
కార్యపత్రం (Worksheet)
కార్యపత్రం, పద్యసహితం (Worksheet with padyam)