పోతన భాగవత పరిమళం

"ఎచ్చటఁ బుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికిన్" [7.46]

తరగతి క్రమము 117   Prev  /  Next

మూలప్రకృతియు, మహదహంకారంబులును, బంచతన్మాత్రంబులు,
నివి యెనిమిదియుం బ్రకృతులనియును, రజస్సత్త్వతమంబులు మూడును
బ్రకృతి గుణంబు లనియును, గర్మేంద్రియంబు లయిన వాక్పాణిపాద
పాయూపస్థంబులును జ్ఞానేంద్రియంబులైన శ్రవణనయన రసనా
త్వగ్ఘ్రాణంబులును మనంబును మహీసలిల తేజోవాయు గగనంబులును
నివి పదాఱును వికారంబులనియును గపిలాది పూర్వాచార్యులచేతఁ
జెప్పంబడియె, సాక్షిత్వంబున నీ యిరువదేడింటిని నాత్మగూడియుండుఁ.
ఛందస్సు (Meter): వచనము
స్కంధము (Chapter): 7
సంఖ్య (Number): 237
తను తన తల్లి గర్భమునందున్న సమయమున నారదుడు వచించినట్లుగా ప్రహ్లాదుడు ఇట్లు పలికెను. ఈ వచనము ఈ క్రింది సంస్కృత శ్లోకమునకు పోతనగారు చేసిన తెలుగు అనువాదము.

अष्टौ प्रकृतयः प्रोक्तास्त्रय​ एव हि तद्गुणाः ।
विकाराः षोडशाचार्यैः पुमानेकः समन्वयात् ॥

అష్టౌ ప్రకృతయః ప్రోక్తాస్త్రయ ఏవ హి తద్‌గుణాః ।
వికారాః షోడశాచార్యైః పుమానేకః సమన్వయాత్ ॥
వ్యాఖ్య
ఆత్మ ఏవిధమైన వానివలన (ఇరవై ఎనిమిది అంశముల వలన) భౌతిక ప్రపంచములో చుట్టబడియున్నదో నారదుడు ఇచ్చట చెప్పుచుండెను.

మూలప్రకృతియు = ఆది ప్రకృతియు;
మహదహంకారంబులును, = మహత్ మఱియు అహంకారములు అను రెండును;
పంచతన్మాత్రంబులు = ఐదు తన్మాత్రలు: శబ్దము, స్పర్శనము, రూపము, రసము, గంధము;
ఇవి యెనిమిదియుం బ్రకృతులనియును = ఈ [పై చెప్పబడిన] ఎనిమిది (8) ప్రకృతులును;

రజసత్త్వతమంబులు మూడును = రజస్సు, సత్వము, తమము - ఐన మూడు (3);
ప్రకృతి గుణంబు లనియును = ప్రకృతి గుణములును;

కర్మేంద్రియంబు లయిన = కర్మేంద్రియములైన;
వాక్పాణిపాద పాయూపస్థంబులును = వాక్కు, పాదములు, చేతులు, పాయువు [ఒక రహస్యావయవము], ఉపస్థము [ఇంకొక రహస్యావయవము] - అను ఐదును (5);
జ్ఞానేంద్రియంబులైన = జ్ఞానేంద్రియములైన;
శ్రవణనయన రసనా త్వగ్ఘ్రాణంబులును = చెవులు, కన్నులు, నాలుక, చర్మము, ముక్కు - ఇవి ఐదును (5);
మనంబును = మనస్సు (1);
మహీసలిల తేజోవాయు గగనంబులును = నేల, నీరు, నిప్పు, గాలి, నింగి - ఇవి ఐదును (5);
ఇవి పదాఱును = ఈ పై చెప్పబడిన పదునారును;
వికారంబులనియును = వికారములని;

కపిలాది పూర్వాచార్యులచేతఁ జెప్పంబడియె = కపిలుడు మొదలైన ఆచార్యులచేత చెప్పబడెను;

సాక్షిత్వంబున నీ యిరువదేడింటిని = సాక్షిగా [మాత్రమే] ఉండునట్టి ఈ ఇరవై ఏడింటిని
ఆత్మగూడియుండుఁ = ఆత్మ చేరియుండును;
సాధన
మూలప్రకృతియు, మహదహంకారంబులును, బంచతన్మాత్రంబులు,
నివి
యెనిమిదియుం బ్రకృతులనియును, రజస్సత్త్వతమంబులు మూడును
బ్రకృతి గుణంబు లనియును, గర్మేంద్రియంబు లయిన వాక్పాణిపాద
పాయూపస్థంబులును
జ్ఞానేంద్రియంబులైన శ్రవణనయన రసనా
త్వగ్ఘ్రాణంబులును
మనంబును మహీసలిల తేజోవాయు గగనంబులును
నివి పదాఱును వికారంబులనియును గపిలాది పూర్వాచార్యులచేతఁ
జెప్పంబడియె, సాక్షిత్వంబున నీ యిరువదేడింటిని నాత్మగూడియుండుఁ.
mUlaprakRtiyu, mahadahaMkAraMbulunu, baMcatanmAtraMbulu,
nivi
yenimidiyuM brakRtulaniyunu, rassattvatamaMbulu mUDunu
brakRti guNaMbu laniyunu, garmEMdriyaMbu layina vAkpANipAda
pAyUpasthaMbulunu
j~nAnEMdriyaMbulaina SravaNanayana rasanA
tvagghrANaMbulunu
manaMbunu mahIsalila tEjOvAyu gaganaMbulunu
nivi padA~runu vikAraMbulaniyunu gapilAdi pUrvAcAryulacEta@M
jeppaMbaDiye, sAkshitvaMbuna nI yiruvadEDiMTini nAtmagUDiyuMDu@M.
కార్యపత్రం (Worksheet)
కార్యపత్రం, పద్యసహితం (Worksheet with padyam)