పోతన భాగవత పరిమళం

"ఎచ్చటఁ బుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికిన్" [7.46]

αβ'cal 174   Prev  /  Next

(తరగతి క్రమము 133)
విశ్వాత్ముఁడు విశ్వేశుఁడు
విశ్వమయుం డఖిలనేత విష్ణుఁ డజుం డీ
విశ్వములోఁ దా నుండును
విశ్వము దనలోనఁ జాల వెలుఁగుచు నుండన్
ఛందస్సు (Meter): కందము
స్కంధము (Chapter): 2
సంఖ్య (Number): 100
"ప్రారంభాదివివేక మెవ్వఁ డొసఁగు?" [2.74] అని నారదుడు బ్రహ్మను అడుగగా, బ్రహ్మ సృష్టి విజ్ఞామును బోధించుచు ఇట్లు పలికెను.
వ్యాఖ్య
సాధన
విశ్వాత్ముఁడు విశ్వేశుఁడు
విశ్వమయుం డఖిలనేత విష్ణుఁ డజుం డీ
విశ్వములోఁ
దా నుండును
విశ్వము దనలోనఁ జాల వెలుఁగుచు నుండన్
viSvAtmu@MDu viSvESu@MDu
viSvamayuM DakhilanEta vishNu@M DajuM DI
viSvamulO@M
dA nuMDunu
viSvamu danalOna@M jAla velu@Mgucu nuMDan
కార్యపత్రం (Worksheet)
కార్యపత్రం, పద్యసహితం (Worksheet with padyam)