పోతన భాగవత పరిమళం

"ఎచ్చటఁ బుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికిన్" [7.46]

αβ'cal 81   Prev  /  Next

(తరగతి క్రమము 139)
కమనీయ భూమిభాగములు లేకున్నవే పడియుండుటకు దూదిపఱుపు లేల
సహజంబులగు కరాంజలులు లేకున్నవే భోజనభాజనపుంజ మేల
వల్కలాజిన కుశావళులు లేకున్నవే కట్ట దుకూల సంఘంబు లేల
గొనకొని వసియింప గుహలు లేకున్నవే ప్రాసాదసౌధాది పటల మేల

ఫలరసాదులు గురియవే పాదపములు
స్వాదుజలముల నుండవే సకల నదులు
పొసఁగ భిక్షము వెట్టరే పుణ్యసతులు
ధనమదాంధుల కొలువేల తాపసులకు
ఛందస్సు (Meter): సీసము, ఆటవెలది
స్కంధము (Chapter): 2
సంఖ్య (Number): 21
శుకుడు పరీక్షిత్తునకు ముక్తి మార్గమును తెలుపుతూ, యోగి అనుసరింపదగిన మార్గములను తెలిపి, ధారణ ఏవిధముగా చెయదగునో చెప్పెను. తదుపరి, మూఢముగా వేదమార్గముతో కర్మఫలసాధనకు యత్నించరాదని, "ఎంత దేహనిర్వహణంబు సిద్ధించు"నో అంతయే గైకొనవలెనని తెలిపి ఈ పద్యములో చెప్పిన విధముగా చెప్పెను. ఈ పద్యము ఈ క్రింది రెండు శ్లోకములకు పోతనగారు చేసిన తెలుగు అనువాదము.

सत्त्यां क्षितौ किं कशिपोः प्रयासैर्बाहौ स्वसिद्धे ह्युपबर्हणैः किम् ।
सत्यञ्जलौ किं पुरुधान्नपात्रया दिग्वल्कलादौ सति किं दुकूलैः ॥
चीराणि किं पथि न सन्ति दिशन्ति भिक्षां नैवाङ्घिपाः परभृतः सरितोऽप्यषुश्यन् ।
रुद्धा गुहाः किमजितोऽवति नोपसन्नान् कस्माद् भजन्ति कवयो धनदुर्मदान्धान् ॥

సత్త్యాం క్షితౌ కిం కశిపోః ప్రయాసైర్బాహౌ స్వసిద్ధే హ్యుపబర్హణైః కిమ్ |
సత్యఞ్జలౌ కిం పురుధాన్నపాత్ర్యా దిగ్వల్కలాదౌ సతి కిం దుకూలైః ||
చీరాణి కిం పథి న సన్తి దిశన్తి భిక్షాం నైవాఙ్ఘిపాః పరభృతః సరితోప్యశుష్యన్ |
రుద్ధా గుహాః కిమజితోవతి నోపసన్నాన్ కస్మాద్ భజన్తి కవయో ధనదుర్మదాన్ధాన్ ||
వ్యాఖ్య
కమనీయ భూమిభాగములు లేకున్నవే = మనోహరమైన ఈ భూమి (నేల) లేదా;
పడియుండుటకు దూదిపఱుపు లేల = పడుకోవడానికి దూది పరుపులెందులకు?
సహజంబులగు కరాంజలులు లేకున్నవే = సహజమైన చేతులు, దోసిళ్ళు లేవా;
భోజనభాజనపుంజ మేల = అన్నం తినేందుకు పాత్రలు వగైరా ఎందులకు?
వల్కలాజిన కుశావళులు లేకున్నవే = నార చీరలు, జంతు చర్మములు, ఆకులు లేవా;
కట్ట దుకూల సంఘంబు లేల = కట్టుకొనుటకు తెల్లని వస్త్రములెందులకు?
గొనకొని వసియింప గుహలు లేకున్నవే = ప్రయత్నించగా నివసించుటకు గుహలు లేవా;
ప్రాసాదసౌధాది పటల మేల = భవనములు, మేడలు ఎందులకు?
ఫలరసాదులు గురియవే పాదపములు = చెట్లు తీయని పండ్లను ఇవ్వకుండా పోతాయా?
స్వాదుజలముల నుండవే సకల నదులు = ఏ నదిలో తీయని నీరు ఉండదు?
పొసఁగ భిక్షము వెట్టరే పుణ్యసతులు = పుణ్య సతులు విధిగా భిక్ష పెట్టరా?
ధనమదాంధుల కొలువేల తాపసులకు = (ఇవన్ని ఇలా ఉండగా, మరి) తాపసులైన వారికి ధన అహంకారముతో గ్రుడ్డివారైన వారితో సాంగత్యమేల?
సాధన
కమనీయ భూమిభాగములు లేకున్నవే పడియుండుటకు దూదిపఱుపు లేల
సహజంబులగు కరాంజలులు లేకున్నవే భోజనభాజనపుంజ మేల
వల్కలాజిన కుశావళులు లేకున్నవే కట్ట దుకూల సంఘంబు లేల
గొనకొని వసియింప గుహలు లేకున్నవే ప్రాసాదసౌధాది పటల మేల

ఫలరసాదులు గురియవే పాదపములు
స్వాదుజలముల నుండవే సకల నదులు
పొసఁగ భిక్షము వెట్టరే పుణ్యసతులు
ధనమదాంధుల కొలువేల తాపసులకు
kamanIya bhUmibhAgamulu lEkunnavE paDiyuMDuTaku dUdipa~rupu lEla
sahajaMbulagu karAMjalulu lEkunnavE bhOjanabhAjanapuMja mEla
valkalAjina kuSAvaLulu lEkunnavE kaTTa dukUla saMghaMbu lEla
gonakoni vasiyiMpa guhalu lEkunnavE prAsAdasaudhAdi paTala mEla

phalarasAdulu guriyavE pAdapamulu
svAdujalamula nuMDavE sakala nadulu
posa@Mga bhikshamu veTTarE puNyasatulu
dhanamadAMdhula koluvEla tApasulaku
కార్యపత్రం (Worksheet)
కార్యపత్రం, పద్యసహితం (Worksheet with padyam)