పోతన భాగవత పరిమళం

"ఎచ్చటఁ బుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికిన్" [7.46]

గ్రంథ క్రమము 53   Prev  /  Next

(తరగతి క్రమము 22)
నావలని కోర్కి యూరక
పోవదు; విడిపించు దోషపుంజములను మ
త్సేవం బుట్టును వైళమ
భావింపఁగ నాదు భక్తి బాలక! వింటే.
ఛందస్సు (Meter): కందము
స్కంధము (Chapter): 1
సంఖ్య (Number): 126
ఈ పద్యము ఈ క్రింది మొదటి శ్లోకములోని చివరి పాదము, రెండవ శ్లోకములోని మొదటి పాదములకు పోతనగారు చేసిన అనువాదము.

सकृद् यद् दर्शितं रूपमेतत्कामाय तेऽनघ ।
मत्कामः शनकैः साधुः सर्वान्मुञ्चति हृच्छयान् ॥
सत्सेवयादीर्घयापि जाता मयि दृढामतिः ।
हित्वावद्यमिमं लोकं गन्ता मज्जनतामसि ॥

సకృద్‌యద్ దర్శితం రూపమేతత్కామాయ తేऽనఘ ।
మత్కామః శనకైః సాధు సర్వాన్ముఞ్చతి హృచ్ఛయాన్॥
సత్సేవయాదీర్ఘయాపి జాతా మయి దృఢా మతిః ।
హిత్వావద్యమిమం లోకం గంతా మజ్జనతామసి ॥
వ్యాఖ్య
నావలని కోర్కి = నన్ను [భగవంతుని] తెలిసికొనవలెననే కోరిక;
యూరక పోవదు = వ్యర్ధము కాదు [ఆ కోరిక నిన్ను భక్తునిగా చేయును/పరిపూర్ణత్వమును సంపాదించును];
విడిపించు దోషపుంజములను = (భౌతిక ప్రపంచపు వాంఛల వలన కలిగిన) దోష సమూహములను విడిపించును;
మత్సేవం బుట్టును = నన్ను సేవించగా, పుట్టును;
వైళమ = వెంటనే;
భావింపఁగ = తలచుకొనిన;
నాదు భక్తి = నాయందు భక్తి (కలుగును);
బాలక! వింటే = ఓ బాలకా వినుము.

నారదుడు తన పూర్వజన్మలో ఒక దాసీ పుత్రుడు. తన తల్లితో పాటు వేదపండితుల ఇండ్లలో సేవలు చేసేవాడు. వారు తనకు భగవంతుని మాయా స్వరూపాన్ని తెలిపెను. తన తల్లి మరణించిన తరువాత అడవికేగి భగవంతుని కొరకు వెదికెను. అలసి ఒకచోట కూర్చొన్న ఆ బాలునికి మనసులో భగవంతుడు ప్రత్యక్షమై మరల మాయమాయెను. నిరాశతో అంతా వెదికిన ఆ బాలునికి భగవంతుని పలుకులు వినిపించెను. "కామక్రోదాదులు విడిచి, కర్మలను నిర్మూలించిన మునులకు మాత్రమే నేను కనిపించెదను" అని, ఇంకా ఈ పద్యములో చెప్పిన విధముగా వినిపించెను.
సాధన
నావలని కోర్కి యూరక
పోవదు;
విడిపించు దోషపుంజములను
త్సేవం బుట్టును వైళమ
భావింపఁగ
నాదు భక్తి బాలక! వింటే.
nAvalani kOrki yUraka
pOvadu;
viDipiMcu dOshapuMjamulanu ma
tsEvaM buTTunu vaiLama
bhAviMpa@Mga
nAdu bhakti bAlaka! viMTE.
కార్యపత్రం (Worksheet)
కార్యపత్రం, పద్యసహితం (Worksheet with padyam)