పోతన భాగవత పరిమళం

"ఎచ్చటఁ బుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికిన్" [7.46]

అక్షర క్రమము 1   Prev  /  Next

(తరగతి క్రమము 83)
అంధకారవైరి యపరాద్రి కవ్వలం
జనిన నంధమయిన జగముభంగి
నిన్నుఁ గానకున్న నీరజలోచన
యంధతమస మతుల మగుదు మయ్య.
ఛందస్సు (Meter): ఆటవెలది
స్కంధము (Chapter): 1
సంఖ్య (Number): 254
ఈ పద్యము ఈ క్రింది సంస్కృత శ్లోకములోని రెండవ పాదమునకు పోతనగారు చేసిన తెలుగు అనువాదము:

यर्ह्यंबुजाक्शापससार भवान् कुरून् मधून् वाथ सुहृद्दिदृक्षया ।
तत्राब्दकोटिप्रतिमः क्षणो भवेद् रविं विनाक्ष्णोरिव नस्तवाच्युत ॥

యర్హ్యంబుజాక్షాపససార భో భవాన్ కురూన్ మధూన్ వాథ సుహృద్దిదృక్షయా ।
తత్రాబ్దకోటిప్రతిమః క్షణో భవేత్ రవిం వినాక్ష్ణోరివ నస్తవాచ్యుత ॥
వ్యాఖ్య
యుద్ధానంతరము కృష్ణుడు హస్తినాపురమునుడి ద్వారకానగరమునకేగుచున్న సందర్భములో ఎంతోకాలమునకు తిరిగి తమనగరములో కృష్ణుని చూడగలిగిన అదృష్టమునకు పురజనులు ఈ విధముగా స్పందించుచున్నారు.
సాధన
అంధకారవైరి యపరాద్రి కవ్వలం
జనిన
నంధమయిన జగముభంగి
నిన్నుఁ గానకున్న నీరజలోచన
యంధతమస మతుల మగుదు మయ్య.
aMdhakAravairi yaparAdri kavvalaM
janina
naMdhamayina jagamubhaMgi
ninnu@M gAnakunna nIrajalOcana
yaMdhatamasa matula magudu mayya.
కార్యపత్రం (Worksheet)
కార్యపత్రం, పద్యసహితం (Worksheet with padyam)