పోతన భాగవత పరిమళం

"ఎచ్చటఁ బుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికిన్" [7.46]

గ్రంథ క్రమము 115   Prev  /  Next

(తరగతి క్రమము 98)
ఆకారజన్మ విద్యార్థవరిష్ఠుడై గర్వసంస్తంభ సంగతుఁడు గాఁడు
వివిధమహానేక విషయసంపన్నుఁడై పంచేంద్రియములచేఁ బట్టువడఁడు
భవ్యవయోబల ప్రాభవోపేతుఁడై కామరోషాదులఁ గ్రందుకొనఁడు
కామినీ ప్రముఖ భోగము లెన్ని గలిగిన వ్యసనసంసక్తి నా వంకఁబోడు

విశ్వమందుఁ గన్న విన్న యర్థములందు
వస్తుదృష్టిఁ జేసి వాంఛ యిడఁడు
ధరణినాథ! దైత్య తనయుండు హరిపర
తంత్రుఁడై హతాన్యతంత్రుఁ డగుచు.
ఛందస్సు (Meter): సీసము, ఆటవెలది
స్కంధము (Chapter): 7
సంఖ్య (Number): 117
ప్రహ్లాదుని గుణగణములను వర్ణించుచు నారదుడు యుధిష్ఠురినితో ఇట్లు పలికెను. ఈ పద్యము ఈ క్రింది మొదటి శ్లోకములోని రెండవ పాదము, రెండవ శ్లోకములకు పోతనగారు చేసిన తెలుగు అనువాదము.

भ्रातृवत्सदृशे स्निग्धो गुरुष्वीश्वरभावनः ।
विद्यार्थरुपजन्माढ्यो मानस्तम्भविवर्जितः ॥
नोद्विग्नचित्तो व्यसनेषु निःस्पृहः श्रुतेषु दृष्टेषु गुणोष्ववस्तुदृक् ।
दान्तेन्द्रियप्राणशरीरधीः सदा प्रशान्तकामो रहितासुरोऽसुरः ॥

భ్రాతృవత్సదృశే స్నిగ్ధో గురుస్వీశ్వరభావనః ।
విద్యార్థరూపజన్మాఢ్యో మానస్తంభవివర్జితః ॥
నోద్విగ్నచిత్తో వ్యసనేషు నిస్పృహః శ్రుతేషు దృష్టేషు గుణేష్వస్తుదృక్ ।
దాంతేంద్రియప్రాణశరీరధీః సదా ప్రశాంతకామో రహితాసురో సురః ॥
వ్యాఖ్య
సాధన
ఆకారజన్మ విద్యార్థ వరిష్ఠుడై గర్వసంస్తంభ సంగతుఁడు గాఁడు
వివిధమహానేక విషయసంపన్నుఁడై పంచేంద్రియములచేఁ బట్టువడఁడు
భవ్యవయోబల ప్రాభవోపేతుఁడై కామరోషాదులఁ గ్రందుకొనఁడు
కామినీ ప్రముఖ భోగము లెన్ని గలిగిన వ్యసనసంసక్తి నా వంకఁబోడు

విశ్వమందుఁ గన్న విన్న యర్థములందు
వస్తుదృష్టిఁ జేసి వాంఛ యిడఁడు
ధరణినాథ! దైత్య తనయుండు హరిపర
తంత్రుఁడై
హతాన్యతంత్రుఁ డగుచు.
AkArajanma vidyArtha varishThuDai garvasaMstaMbha saMgatu@MDu gA@MDu
vividhamahAnEka vishayasaMpannu@MDai paMcEMdriyamulacE@M baTTuvaDa@MDu
bhavyavayObala prAbhavOpEtu@MDai kAmarOshAdula@M graMdukona@MDu
kAminI pramukha bhOgamu lenni galigina vyasanasaMsakti nA vaMka@MbODu

viSvamaMdu@M ganna vinna yarthamulaMdu
vastudRshTi@M jEsi vAMCa yiDa@MDu
dharaNinAtha! daitya tanayuMDu haripara
taMtru@MDai
hatAnyataMtru@M Dagucu.
కార్యపత్రం (Worksheet)
కార్యపత్రం, పద్యసహితం (Worksheet with padyam)