పోతన భాగవత పరిమళం

"ఎచ్చటఁ బుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికిన్" [7.46]

గ్రంథ క్రమము 73   Prev  /  Next

(తరగతి క్రమము 40)
వాయువశంబులై యెగసి వారిధరంబులు మింటఁ గూడుచుం
బాయుచు నుండు కైవడిఁ బ్రపంచము సర్వముఁ గాల తంత్రమై
పాయుచుఁ గూడు చుండు నొకభంగిఁ జరింపదు కాల మన్నియుం
జేయుచు నుండుఁ గాలము విచిత్రము దుస్తర మెట్టివారికిన్.
ఛందస్సు (Meter): ఉత్పలమాల
స్కంధము (Chapter): 1
సంఖ్య (Number): 210
వ్యాఖ్య
భీష్ముడు పాండవులను ఉద్దేశించి ఇట్లు పలికెను.
సాధన
వాయువశంబులై యెగసి వారిధరంబులు మింటఁ గూడుచుం
బాయుచు నుండు కైవడిఁ
బ్రపంచము సర్వముఁ గాల తంత్రమై
పాయుచుఁ గూడు చుండు నొకభంగిఁ జరింపదు కాల మన్నియుం
జేయుచు నుండుఁ
గాలము విచిత్రము దుస్తర మెట్టివారికిన్.
vAyuvaSaMbulai yegasi vAridharaMbulu miMTa@M gUDucuM
bAyucu nuMDu kaivaDi@M
brapaMcamu sarvamu@M gAla taMtramai
pAyucu@M gUDu cuMDu nokabhaMgi@M jariMpadu kAla manniyuM
jEyucu nuMDu@M
gAlamu vicitramu dustara meTTivArikin.
కార్యపత్రం (Worksheet)
కార్యపత్రం, పద్యసహితం (Worksheet with padyam)