పోతన భాగవత పరిమళం

"ఎచ్చటఁ బుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికిన్" [7.46]

గ్రంథ క్రమము 47   Prev  /  Next

(తరగతి క్రమము 77)
ఎఱుక గలవాఁడు హరిసేవకుం బ్రయత్నంబు సేయందగుఁ;
గాలక్రమంబున సుఖ దుఃఖంబులు ప్రాప్తంబు లయినను హరిసేవ విడువం దగదు;
దానం జేసి యూర్థ్వంబున బ్రహ్మ పర్యంతంబు గ్రింద స్థావర పర్యంతంబుఁ
దిరుగుచున్న జీవులకు నెయ్యది పొందరా దట్టిమేలు సిద్ధించు కొఱకు
హరిసేవ సేయవలయు.
ఛందస్సు (Meter): వచనము
స్కంధము (Chapter): 1
సంఖ్య (Number): 101
ఈ వచనము ఈ క్రింది సంస్కృత శ్లోకమునకు పోతనగారు చేసిన తెలుగు అనువాదము:

तस्त्यैव हेतोः प्रयतेत कोविदो न लभ्यते यद्भ्रमतामुपर्यधः।
तल्लभ्यते दुःखवदन्यतः सुखं कालेन सर्वत्र गभीररंहसा॥

తస్తైవ హేతోః ప్రయతేత కోవిదో న లభ్యతే యద్భ్రమతాముపర్యధః ।
తల్లభ్యతే దుఃఖవదన్యతః సుఖమ్ కాలేన సర్వత్ర గభీరరంహసా ॥
వ్యాఖ్య
నారదుడు వ్యాకులచిత్తుడైన వ్యాసునికడకు వచ్చి భాగవతమును వ్రాయమని ఉపదేశించిన సందర్భములో ఈ విధముగా పలికెను. "జుగుప్సితంబులగు కామ్యకర్మంబులు సేయుచు" జనులు "తత్త్వజ్ఞానంబు మఱతు"రని (1.98), "ఎఱిఁగెడు వాఁడు కర్మచయ మెల్లను" మానునని (1.99), భగవంతుని "సేవ బాసిన కులధర్మ గౌరవములు" ఎన్నడు సిద్ధి వహించవని (1.100) తెలిపి ఈ వచనములో చెప్పిన విధముగా బోధించెను.
సాధన
ఎఱుక గలవాఁడు హరిసేవకుం బ్రయత్నంబు సేయందగుఁ;
గాలక్రమంబున సుఖ దుఃఖంబులు ప్రాప్తంబు లయినను హరిసేవ విడువం దగదు;
దానం జేసి యూర్థ్వంబున బ్రహ్మ పర్యంతంబు గ్రింద స్థావర పర్యంతంబుఁ
దిరుగుచున్న జీవులకు నెయ్యది పొందరా దట్టిమేలు సిద్ధించు కొఱకు
హరిసేవ సేయవలయు.
e~ruka galavA@MDu harisEvakuM brayatnaMbu sEyaMdagu@M;
gAlakramaMbuna sukha du@HkhaMbulu prAptaMbu layinanu harisEva viDuvaM dagadu;
dAnaM jEsi yUrthvaMbuna brahma paryaMtaMbu griMda sthAvara paryaMtaMbu@M
dirugucunna jIvulaku neyyadi poMdarA daTTimElu siddhiMcu ko~raku
harisEva sEyavalayu.
కార్యపత్రం (Worksheet)
కార్యపత్రం, పద్యసహితం (Worksheet with padyam)