పోతన భాగవత పరిమళం

"ఎచ్చటఁ బుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికిన్" [7.46]

అక్షర క్రమము 33   Prev  /  Next

(తరగతి క్రమము 71)
ఎప్పుడీ స్థూల సూక్ష్మరూపంబులు రెండు
స్వరూప సమ్యగ్‌జ్ఞానంబునం బ్రతిషేధింపంబడుననియు
నవిద్యం జేసి యాత్మను గల్పింపంబడుననియుం దెలియు నప్పుడు
జీవుండు బ్రహ్మ దర్శనంబున కధికారియగు.
ఛందస్సు (Meter): వచనము
స్కంధము (Chapter): 1
సంఖ్య (Number): 67
ఈ వచనము ఈ క్రింది సంస్కృత శ్లోకమునకు పోతనగారు చేసిన తెలుగు అనువాదము.

यत्रेमे सदसद्रूपे प्रतिषिद्धे स्वसंविदा ।
अविद्ययात्मनि कृते इति तद्ब्रह्मदर्शनम् ॥

యత్రేమే సదసద్రూపే ప్రతిషిద్ధే స్వసంవిదా।
అవిద్యయాత్మని కృతే ఇతి తద్బ్రహ్మదర్శనం॥
వ్యాఖ్య
[సూతుడు ఈ విధముగా చెప్పెను:] ఎప్పుడు + ఈ స్థూల సూక్ష్మరూపంబులు రెండు = ఎప్పుడయితే ఈ స్థూల శరీరము, సూక్ష్మ శరీరములు రెండు;

స్వరూప సమ్యగ్‌జ్ఞానంబునం = పూర్తి స్వరూప జ్ఞానము ద్వారా;
ప్రతిషేధింపంబడు =నిషేధింపబడుచున్నవో;
అపుడు = అపుడు;
అవిద్యం జేసి యాత్మను గల్పింపంబడుననియుం దెలియు ననియు = అజ్ఞానము చే [ఈ రెండు రూపములు] ఆత్మకు కల్పింపబడినవి అని తెలియును;
జీవుండు బ్రహ్మ దర్శనంబున కధికారియగు = [అప్పుడు] జీవునకు బ్రహ్మ దర్శ్నము కలుగును;
సాధన
ఎప్పుడీ స్థూల సూక్ష్మరూపంబులు రెండు
స్వరూప సమ్యగ్‌జ్ఞానంబునం బ్రతిషేధింపంబడుననియు
నవిద్యం జేసి యాత్మను గల్పింపంబడుననియుం దెలియు నప్పుడు
జీవుండు బ్రహ్మ దర్శనంబున కధికారియగు.
eppuDI sthUla sUkshmarUpaMbulu reMDu
svarUpa samyag^j~nAnaMbunaM bratishEdhiMpaMbaDunaniyu
navidyaM jEsi yAtmanu galpiMpaMbaDunaniyuM deliyu nappuDu
jIvuMDu brahma darSanaMbuna kadhikAriyagu.
కార్యపత్రం (Worksheet)
కార్యపత్రం, పద్యసహితం (Worksheet with padyam)