పోతన భాగవత పరిమళం

"ఎచ్చటఁ బుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికిన్" [7.46]

తరగతి క్రమము 102   Prev  /  Next

ఎల్ల శరీర ధారులకు నిల్లను చీఁకటినూతిలోపలం
ద్రెళ్ళక వీరు నే మను మతిభ్రమణంబున భిన్నులై ప్రవ
ర్తిల్లక సర్వము న్నతని దివ్యకళామయ మంచు విష్ణునం
దుల్లముఁ జేర్చి తా రడవి నుండుట మేలు నిశాచరాగ్రణీ
ఛందస్సు (Meter): ఉత్పలమాల
స్కంధము (Chapter): 7
సంఖ్య (Number): 142
ఈ పద్యము ఈ క్రింది సంస్కృత శ్లోకమునకు పోతనగారు చేసిన తెలుగు అనువాదము.
श्री प्रह्लाद उवाच​
तत्साधु मन्येऽसुरवर्य देहिनां सदा समुद्विग्नधियामसद्ग्रहात्।
हित्वात्मपातं गृहमन्धकूपं वनं गतो यद्धरिमाश्रयेत्॥

శ్రీ ప్రహ్లాద ఉవాచ
తత్సాధు మన్యే సురవర్య దేహినాం సదా సముద్విగ్నధియామసద్గ్రహాత్ ।
హిత్వాత్మపాతం గృహమంధకూపం వనం గతో యద్ధరిమాశ్రయేత్ ॥
వ్యాఖ్య
తన కుమారుడైన ప్రహ్లాదుని తన ఒడిలో కూర్చుండబెట్టుకొని, గురువులు బోధించిన అన్ని చదువులలోకెల్ల ఉత్తమమైనది యేదని ప్రశ్నించగా ప్రహ్లాదు డిట్లు పలికెను.

ఎల్ల శరీర ధారులకు = శరీరమును ధరించిన ఎల్లరకు; ఇల్లను చీఁకటినూతిలోపలం = ఇల్లు (సంసారము) అనే చీకతి నూతిలోపల; త్రెళ్ళక = పడిపోకుండ; వీరు నే మను = వీరును (పరాయివారు), మేమును అను భావముతో; మతిభ్రమణంబున = మతి స్తిమితము లేకుండగా; భిన్నులై ప్రవ ర్తిల్లక = భిన్నమయిన (ఛేదింపబడిన) మనసుతో ప్రవర్తించక; సర్వము న్నతని దివ్యకళామయ మంచు = సర్వమూ (కనిపించు జగమంతయు) ఆ భగవంతుని దివ్యమైన కళలే యని; విష్ణునం దుల్లముఁ జేర్చి = భగవంతుని యందు మనసును చేర్చి; తారడవి నుండుట మేలు = తాము అడవిలో నుండుటయే మేలు; నిశాచరాగ్రణీ = (ఓ) దానవశ్రేష్ఠుడా!
సాధన
ఎల్ల శరీర ధారులకు నిల్లను చీఁకటినూతిలోపలం
ద్రెళ్ళక వీరు నే మను మతిభ్రమణంబున భిన్నులై ప్రవ
ర్తిల్లక
సర్వము న్నతని దివ్యకళామయ మంచు విష్ణునం
దుల్లముఁ జేర్చి
తా రడవి నుండుట మేలు నిశాచరాగ్రణీ
ella SarIra dhArulaku nillanu cI@MkaTinUtilOpalaM
dreLLaka vIru nE manu matibhramaNaMbuna bhinnulai prava
rtillaka
sarvamu nnatani divyakaLAmaya maMcu vishNunaM
dullamu@M jErci
tA raDavi nuMDuTa mElu niSAcarAgraNI
కార్యపత్రం (Worksheet)
కార్యపత్రం, పద్యసహితం (Worksheet with padyam)